మినిమం రూ.100 కోట్లు.. అప్పడు బాలీవుడ్ లో ఇప్పడు టాలీవుడ్‌ లో

Update: 2022-08-22 15:30 GMT
కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ గడ్డు కాలం ను ఎదుర్కొంటుంది. బాలీవుడ్‌ లో పరిస్థితి ఇంకా కుదుటపడలేదు. కాని టాలీవుడ్‌ పరిస్థితి చూస్తూ ఉంటే కరోనా పరిస్థితుల నుండి పూర్తిగా బయట పడ్డట్లే అనిపిస్తుంది. టాలీవుడ్‌ సినిమాల బిజినెస్ మరియు పలు సినిమాలు సాధించిన వసూళ్లు చూస్తూ ఉంటే మునుపటి రోజులు గుర్తుకు వస్తున్నాయంటూ ట్రేడ్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కరోనాకు ముందు బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలు.. మీడియం రేంజ్ హీరోలు కూడా మినిమం వంద కోట్ల వసూళ్లు సాధిస్తూ వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో పండుగ వాతావరణం ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. హిందీ సినిమాలు వంద కోట్లు వసూళ్లు చేసి చాలా కాలం అయ్యింది. అక్కడ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

ఈ సమయంలో తెలుగు సినిమాల జోరు కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో విడుదల అయిన ఎక్కువ శాతం స్టార్‌ హీరోల సినిమా లు ప్రీ రిలీజ్ బిజినెస్ మినిమం గా వంద కోట్లు అవుతుంది. ఒకప్పుడు బాలీవుడ్‌ లో మినిమం వంద కోట్లు అనే వారు. కాని ఇప్పుడు మాత్రం టాలీవుడ్‌ లో మినిమం వంద కోట్ల వసూళ్లు.. వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కామన్‌ అయ్యింది.

ఈ ఏడాది విడుదల అయిన సినిమాల్లో భీమ్లా నాయక్‌.. ఆర్ ఆర్ ఆర్‌.. సర్కారు వారి పాట సినిమా లు వంద కోట్లకు మించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసుకున్నాయి. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లైగర్‌ సినిమాను కూడా వంద కోట్ల కు మించి అమ్మేశారట.

తెలుగు తో పాటు పాన్ ఇండియా స్థాయి లో విడుదల కాబోతున్న లైగర్‌ సినిమా కేవలం థియేట్రికల్‌ రైట్స్ తో వంద కోట్లకు మించి దక్కించుకోవడం నిజంగా షాకింగ్‌ విషయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్‌ సీనియర్ స్టార్‌ హీరోలు పలువురు వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించడం చాలా కామన్ విషయం అయ్యింది. బాలీవుడ్‌ లో పెద్ద హీరోల సినిమా లు కూడా థియేట్రికల్‌ బిజినెస్ అవ్వని ఈ సమయంలో మన తెలుగు హీరోలు వంద కోట్లు మినిమం గా సాధించడం చూస్తుంటే ఏ స్థాయిలో తెలుగు సినిమా జాతీయ స్థాయిలో దూసుకు పోతుందో అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News