రియా అరెస్ట్‌ తప్పదేమో అనిపిస్తుంది

Update: 2020-08-28 13:30 GMT
సుశాంత్‌ మృతి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అసలు ఈ కేసులో తాను బాధితురాలిని మాత్రమే నింధితురాలిని ఎలా అవుతాను అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడు. ఆయనతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. ఇప్పుడు అతడు మృతి చెందడంతో తాను మానసికంగా కృంగిపోయాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన రియా చక్రవర్తి రోజులు గడుస్తున్నా కొద్ది సుశాంత్‌ కేసులో పీకల్లోతు ఇరుక్కుంటున్నట్లుగా అనిపిస్తుంది.

ఈ కేసులో సీబీఐ వారితో పాటు ఈడీ కూడా ఇన్వాల్వ్‌ అవ్వడంతో అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మనీ ల్యాండరింగ్‌ కేసులో రియాను ఈడీ ప్రశ్నించింది. ప్రస్తుతం సుశాంత్‌ విషయంలో రియాను సీబీఐ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్బంగా ఆమె సుశాంత్‌ డెబిట్‌ కార్డ్‌ పిన్‌ నెంబర్‌ మార్చేందుకు అతడి మేనేజర్‌ తో ప్రయత్నించినట్లుగా సీబీఐ వారి ఎంక్వౌరీలో వెళ్లడయ్యింది.

ఆమె మొబైల్‌ కాంటాక్ట్స మరియు కాల్‌ లిస్ట్‌ లో డ్రగ్స్‌ డీలర్‌ పేర్లు ఉన్నాయి. కనుక ఆమెకు డ్రగ్స్‌ వ్యవహారంలో కూడా సంబంధం ఉందని తేలితే మాత్రం ఆమె అరెస్ట్‌ ఖాయం అంటున్నారు. సుశాంత్‌ ఇంట ల్యాప్‌ టాప్‌ లను ద్వంసం చేయడంతో పాటు హార్డ్‌ డిస్క్‌ లను కూడా ద్వంసం చేసిన ఘటన జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక ఆమెను అరెస్ట్‌ చేసే అవకాశం ఎక్కువ ఉందని నిపుణులు అంటున్నారు. ఆమె బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వారు ఆమెను అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది.
Tags:    

Similar News