దర్శకుడిగా రాజమౌళి ఎంతటి వారో... ఒక స్టార్ హీరోగా బాలకృష్ణ ఎంతటి వారో .. ఫైట్ మాస్టర్లుగా రామ్ -లక్ష్మణ్ బ్రదర్స్ అంతటి వారే.. ఆ స్థాయిని అందుకునేందుకు వారు ఎంతో చెమటోడ్చారు. గొప్ప క్రియేటివిటీని చూపించారు. పరిశ్రమ దిగ్గజాలు చిరంజీవి- నాగార్జున-బాలకృష్ణ- వెంకటేష్ సహా సౌత్ లో అందరు స్టార్ హీరోలతో పని చేసిన అనుభవం వీరి సొంతం. సౌతిండస్ట్రీలో గొప్ప గొప్ప దర్శకులందరితోనూ రామ్ లక్ష్మణ్ కవలలు పని చేశారు. వారి ట్విన్ ఇమేజెస్ ని కళ్లలో దాచకోని హీరో లేడు.. దర్శకనిర్మాతలులేరు...!
అయితే అంత పెద్ద స్థానంలో ఉండి కూడా ట్విన్ బ్రదర్స్ సారీ చెప్పారు. సారీ బోయపాటి గారూ..! అఖండ కోసం డేట్స్ కేటాయించలేకపోయాం. ఆ సమయంలో ఒకేసారి చిరంజీవి గారి ఆచార్య.. మహేష్ సర్కార్ వారి పాట చిత్రాల షెడ్యూళ్లకు లాక్ అయిపోయాం. పైగా అఖండ 40 రోజుల పాటు సుదీర్ఘ షెడ్యూల్ లో పాల్గొనాల్సిన పరిస్థితి ఉంది.. కానీ కుదరలేదు. అందుకే పని చేయలేకపోయాం అని వినమ్రంగా క్షమించమని దర్శకుడు బోయపాటిని అడిగారు.
ఇకపోతే ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ ప్రాజెక్టు నుంచి ఎందుకని తప్పుకున్నారు? అంటే.. అప్పట్లో చరణ్ కి ప్రమాదం జరిగాక .. ఆ షెడ్యూల్ వాయిదా పడడంతో మొత్తం తమ షెడ్యూల్స్ డిస్ట్రబ్ అయ్యాయని కూడా తెలిపారు. పైగా అంత పెద్ద ప్రాజెక్టుకు సుదీర్ఘ కాలం పని చేయాల్సి ఉన్నందున తమ ఇతర కమిట్ మెంట్లకు సమస్యలు తప్పవు. అందుకే రాజమౌళి గారికి కూడా సారీ చెప్పేశారట. ఇకపోతే రాజమౌళితో ఆ ఇద్దరూ చాలా సినిమాలకు పని చేశారు. స్టూడెంట్ నంబర్ 1.. విక్రమార్కుడు మొదలు నిన్నమొన్నటి వరకూ ప్రతి సినిమాకి పని చేశారు. ఏ టెక్నీషియన్ అయినా తన సినిమాకు డేట్స్ కొరత ఉంటే రాజమౌళి ఎప్పుడూ ఇష్టపడడు. మేము ఇంతకుముందు అతనితో కలిసి పని చేయలేశామని కూడా రామ్ లక్ష్మణ్ తెలిపారు. ఆర్.ఆర్.ఆర్ కి పని చేయకపోవడం తమ దురదృష్టమని కూడా అన్నారు.