థియేట‌ర్స్ తెరిచినా ఓటీటీ - ఏటీటీల ప్ర‌భావం త‌గ్గేలా లేదుగా..!

Update: 2020-12-23 13:30 GMT
కోవిడ్-19 నేపథ్యంలో సినీ అభిమానులు కొన్నాళ్లు వినోదానికి దూరం కావాల్సి వచ్చింది. గత కొన్ని నెలలుగా థియేటర్స్ క్లోజ్ అవడంతో జనాలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ని ఆశ్రయించారు. ఇందులో వచ్చే వెబ్ సిరీస్ లను ఒరిజినల్ మూవీస్ ని చూడటం అలవాటు చేసుకున్నారు. అంతేకాకుండా షూటింగ్స్ పూర్తి చేసుకున్న సినిమాలను నిర్మాతలు ఓటీటీ ఏటీటీ వేదికలలో విడుదల చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయినట్లే.. ఇప్పుడు సినిమాలన్నీ డిజిటల్ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే వివిధ బాషల్లో అనేక సినిమాలు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల అయ్యాయి.

డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పుంజుకోవడంతో కొత్తగా మరిన్ని ఓటీటీలు ఏటీటీలు అందుబాటులోకి వచ్చాయి. ఫ్రెష్ కంటెంట్ ని అందించడంతో పాటు ఆఫర్స్ కూడా ప్రకటిస్తూ వీక్షకులను అట్రాక్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకుల నుంచి ఓటీటీలకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా ఏ-క్లాస్ ఆడియెన్స్ నుంచి ఎక్కువ స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. చాలామంది ఇంటిలోనే కూర్చొని హోమ్ థియేటర్ లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ సినిమాలను చూడటానికి ఆసక్తి చూపుతున్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో సంపూర్ణంగా థియేటర్స్ తెరుచుకుని థియేట్రికల్ రిలీజులు ఎక్కువైనా ఓటీటీ - ఏటీటీల ప్ర‌భావం మాత్రం తగ్గదని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా థియేటర్స్ తెరిచాక కూడా ఇలానే కొనసాగుతే రానున్న రోజుల్లో చాలా వరకు సింగిల్ స్క్రిన్ థియేటర్స్ తగ్గిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News