సాగ‌ర తీరంలో చిక్కిన‌ ముగ్గురు మ‌త్స్య ‌క‌న్య‌లు

Update: 2020-12-01 06:50 GMT
మాల్దీవులు సెల‌బ్రిటీల వెకేష‌న్ కి కేరాఫ్ అడ్ర‌స్ ‌లుగా మారాయి. అందాల మ‌లైకా.. తాప్సీ మొద‌లు.. ఇప్ప‌టికీ తార‌ల తాకిడి కొన‌సాగుతూనే వుంది. మాల్దీవుల అందాల్ని అతివల బికినీ అందాలతో మ‌రింతగా మైమ‌ర‌పిం‌జేస్తున్నాయి. సినీ తార‌లే కాకుండా బుల్లితెర భామ‌లు కూడా ఇక్క‌డ హంగామా చేస్తున్నారు.  టూపీస్ లు బికినీలు ధ‌రించి సంద‌డి చేస్తున్నారు. తాజాగా అల్ల‌రి న‌రేష్ హీరోయిన్ షర్మిలా మాండ్రే మ‌రో ఇద్ద‌రు భామ‌ల‌తో క‌లిసి మాల్దీవుల్లో హంగామా చేస్తోంది.

నికోల్ ఫరియా.. షిఫా జోవర్ లతో షర్మిలా మాండ్రే బీచ్ ‌ల‌లో హ‌ల్ ‌చ‌ల్ చేస్తోంది. ఈ ముగ్గురు బీచ్ ‌ల‌లో బికినీలు ధ‌రించి మ‌త్స‌క‌న్య‌ల్లా మారి త‌మ లేలేత అందాల‌తో హీటెక్కిస్తున్నారు. బీచ్ దృశ్యాల‌కు సంబంధించిన ఫొటోల‌ని ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. అవి ఇప్పుడు ఇన్ స్టాని హీటెక్కిస్తున్నాయి. లాక్ ‌డౌన్ స‌మ‌యంలో తార‌లంతా మాల్దీవుల‌కే వెళ్లడం వెన‌క ఏదో ఓ ప్ర‌యోజనం.. బ‌ల‌మైన కార‌ణం వుంద‌నే వాద‌న వినిపిస్తోంది.

అల్లరి నరేష్ ‌తో కలిసి `కెవ్వు కేక‌` చిత్రంతో షర్మిలా మాండ్రే తెలుగు ప్రేక్షకులకు పరిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన ష‌ర్మిలా మాండ్రే చాలా కాలంగా సోష‌ల్ మీడియాకు దూరంగా వుంటూ వ‌స్తోంది. ప్రస్తుతం ఆమె దసరా.. మైసూర్ మసాలా..  గాలిపట 2 అనే మూడు చిత్రాల్లో న‌టిస్తోంది.
Tags:    

Similar News