దసరా మరో 20 రోజుల్లో రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ లోపే థియేటర్లలో, ఓటీటీల్లో సినిమాల సందడి మొదలైంది. పేరున్న హీరోలతో పాటే స్మాల్ హీరోస్ ఈ వారం తమ తమ సినిమాలతో పోటీపడబోతున్నారు. దసరా సీజన్ కు స్టార్ హీరోల మధ్య భారీ పోటీ, చిన్న సినిమాలకు థియేటర్లు లభించే ప్రసక్తి లేకపోవడంతో చాలా వరకు చిన్న హీరోలు తమ సినిమాలతో ఈ వారం బరిలోకి దిగుతున్నారు. కొత్త హీరోల నుంచి పేరున్న స్టార్ ల వరకు థియేటర్, ఓటీటీలో పోటీపడుతున్న ఆ హీరోలెవరో.. ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం.
ఇందులో ముందుగా థియేటర్లలోకి వస్తున్న తమిళ డబ్బింగ్ మూవీ `ముత్తు`. శింబు, సిద్దూ ఇద్నానిజంటగా నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ మూవీ గత కొంత కాలంగా రిలీజ్, నిర్మాణం ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది. శింబు గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈ మూవీ పై మంచి అంచనాలే వున్నాయి. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీని తెలుగులో శ్రీ స్రవంతీ మూవీస్ రిలీజ్ చేస్తోంది.
ఇక సెప్టెంబర్ 16న కిరణ్ అబ్బవరం నటించిన `నేను మీకు బాగా కావాల్సిన వాడిని` రిలీజ్ అవుతోంది. శ్రీధర్ గాదె దర్శకత్వం వహించాడు. దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ మూవీతో నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇక ఇదే రోజు `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అంటూ సుధీర్ బాబు రంగంలోకి దిగేస్తున్నాడు. కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించారు. కొరియన్ మూవీ ఆధారంగా రీమేక్ అయిన సినిమా `శాకిని డాకిని`. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రెజీనా, నివేదా థామస్ నటించారు. ఈ మూవీ 16నే థియేటర్లలోకి వచ్చేస్తోంది.
ఇక కిచ్చా సుదీప్ కె3 కోటికొక్కడు కూడా ఇదే రోజున రిలీజ్ అవుతోంది. మడోన్నా సెబాస్టియన్, అభిరామి, శ్రద్ధాదాస్ కీలక పాత్రలలో నటించారు. శివ కార్తిక్ దర్శకుడు. బిగ్ బాస్ సన్నీ హీరోగా పరిచయం అవుతున్న మూవీ `సకల గుణాభిరామ`. అషిమా నర్వాల్ హీరోయిన్ గా నటించింది. వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడు. 1980లో జరిగిన యదార్థ ప్రేకథ ఆధారంగా `నేను కేరాఫ్ నువ్వు`ని రూపొందించారు. అంతా కొత్త వాళ్లు నటించిన ఈ మూవీతో పాటు `అం అః` కూడా 16నే వచ్చేస్తోంది.
ఈ సినిమాలతో పాటు ఓటీటీ బాటపడుతున్న సినిమాలు కూడా వున్నాయి. కార్తి నటించిన తమిళ చిత్రం `విరుమన్` ఇటీవలే అక్కడ విడుదలైంది. తెలుగులో రిలీజ్ కావాల్సి వుంది. అయితే తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 11 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. భారీ అంచనాల మధ్య జూలైలో విడుదలైన కిచ్చా సుదీప్ `విక్రాంత్ రోణ` సెప్టెంబర్ 16 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదే రోజు `దహాన్` (హిందీ), నెట్ ఫ్లిక్స్ లో `జోగీ` (హిందీ), సెప్టెంబర్ 15న సోనీ లీవ్ లో రవితేజ నటించిన `రామారావు ఆన్ డ్యూటీ` స్ట్రీమింగ్ కాబోతోంది. కాలేజీ రొమాన్స్ తో పాటు పలు సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.