బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్న్ వీడియోలు తీయించి, కొన్ని యాప్‌ల ద్వారా ప్రసారం చేసిన కేసులో ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక కుట్రదారుడిగా కనబడుతున్నందున వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. తాజాగా రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది.
+ రాజ్ కుంద్రా అరెస్టు, కేసు విషయంలో కీలక విషయాలివీ..
1. రాజ్ కుంద్రా ఎందుకు ఈ కేసులో ఇరుకున్నారు?
పోర్న్ వీడియోలు తీయించి వాటిని ఆన్ లైన్ లో పెట్టించిన కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు సోమవారం అర్థరాత్రి తెలిపారు. 45 ఏళ్ల కుంద్రాపై నమోదైన కేసు పోర్న్ వీడియోలు తీయడం.. కొన్ని యాప్‌ల ద్వారా పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన తరువాత వ్యాపారవేత్తను క్రైమ్ బ్రాంచ్ సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
2. కేసు ఏమిటి? అది ఎప్పుడు దాఖలు చేయబడింది?
ఒక బాధిత మహిళ పోలీసులను సంప్రదించి, ఆమె ఫిర్యాదులో కొన్ని ఆరోపణలు చేయడంతో రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదైందని ముంబై పోలీసులు తెలిపారు. ఈ కేసు ఫిబ్రవరి 4న ముంబైలోని సబర్బన్ లోని మల్వానీ పోలీస్ స్టేషన్లో నమోదైంది. "ఆ ప్రాతిపదికన, ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. కేసును క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు. అంతకుముందు, పోర్న్ వీడియోలపై కేసులను నమోదు చేసాం. ఇందులో ఒక నటి మరియు మరికొందరు నిందితులుగా ఉన్నారు" అని ముంబై పోలీసు అధికారి తెలిపారు.
“పోర్న్ వీడియోలు తీయడం.. కొన్ని యాప్‌ల ద్వారా ప్రచురించడంపై ఫిబ్రవరి 2021లో ముంబైలో క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో రాజ్ కుంద్రాను 19/7/21 న అరెస్టు చేసారు. ఈకేసులో ఇతడే ముఖ్య కుట్రదారుడు. దీనికి సంబంధించి మాకు తగిన ఆధారాలు ఉన్నాయి "అని ముంబై పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు." రాజ్ కుంద్రాపై ఉన్న కేసుపై మేము దర్యాప్తు చేస్తున్నామని.. ఇంతకుముందు మేము నమోదు చేసిన కేసుల మధ్య ఏదైనా సంబంధం ఉందా అని తెలుసుకుంటాము " అధికారి తెలిపారు.
3. రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా నమోదైన కేసులివీ?
రాజ్ కుంద్రాపై భారతీయ శిక్షాస్మృతిలోని 420 (మోసం), 34 (సాధారణ ఉద్దేశం), 292 మరియు 293 (అశ్లీల మరియు అసభ్య ప్రకటనలు మరియు ప్రదర్శనలకు సంబంధించినవి), ఐటి చట్టంలోని 67, 67 ఎ సెక్షన్లు.. మహిళల అసభ్య ప్రాతినిధ్యం కింద కేసు నమోదు చేశారు.
4. ఆధారాలివీ..
పోర్న్ రాకెట్‌పై జరిపిన దర్యాప్తులో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు.. మరో నలుగురితో కలిపే వాట్సాప్ చాట్‌లో పోర్న్ వీడియోలు తయారు చేసినందకు సంబంధించిన చెల్లింపులు, మార్కెటింగ్ గురించి చర్చించిన డీల్స్ ను పోలీసులు సాక్ష్యంగా చూపారు. కొన్ని కంపెనీలు వర్ధమాన హీరోయిన్లను పోర్న్ వీడియోల కోసం రాజీ పడమని.. పోర్న్ వీడియోల్లో నటించమని అడుగుతున్నాయి.. పెద్ద బడ్జెట్ ఇస్తే బాలీవుడ్ చిత్రాలను వదిలేసి నటిస్తామని చెబుతున్నారు.
ఈ పోర్న్ వీడియోల చిత్రీకరణ కోసం ముంబై అంతటా బంగ్లాలను అద్దెకు తీసుకుంటారు. తరువాత పోర్న్ వీడియోలు తీసి వాటిని పోర్న్ సైట్లు -మొబైల్ యాప్స్ లో అప్‌లోడ్ చేస్తారు. ఇటువంటి వీడియోలు కంపెనీలకు లక్ష రూపాయల ఆదాయాన్ని ఇస్తాయి. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్, వాట్సాప్ సహా సోషల్ మీడియా సైట్లలో ఇలాంటి పోర్న్ వీడియోల ట్రైలర్లను కూడా నిందితులు విడుదల చేసేవారు అని ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు.
5. కేసులో మంగళవారం మరో అరెస్ట్
ముంబైలో పోర్న్ వీడియోలను తయారు చేశాడనే ఆరోపణలతో ముంబై పోలీసులు మంగళవారం మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. నవీ ముంబైలోని నెరుల్ నుంచి ర్యాన్ జాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.