పుష్పను వీళ్లంతా మిస్ చేసుకున్నారట

Update: 2022-01-27 04:30 GMT
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పుష్ప.. సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. బన్నీ రేంజ్ ను పూర్తిగా మార్చేసింది. ఈ పాన్ ఇండియా మూవీ తర్వాత అల్లు అర్జున్ రెమ్యునరేషన్ సైతం కళ్లు చెదిరేలా మారిందన్న మాట వినిపిస్తోంది. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవటంతోపాటు.. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయిన తీరు.. అతని నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు అందజేస్తున్నారు. అయితే.. పుష్ప మూవీ కోసం తొలుత బన్నీకి బదులుగా ఒక ప్రముఖ హీరోను అనుకున్నారట. ఆ మాటకు వస్తే.. హీరోను మాత్రమే కాదు.. హీరోయిన పాత్రకు రష్మికను కాకుండా తొలుత అనుకున్న స్టార్ హీరోయిన్ వేరే. ఇలా.. ఈ సినిమా కోసం కొన్ని ముఖ్య పాత్రలకు అనుకున్న వారు నో చెప్పటం.. దాంతో ఇప్పుడు చేసిన వారికి అవకాశం దక్కింది.

ఈ రోజున పుష్ప విజయాన్ని..అది సాధించిన పాపులార్టీని చూసినోళ్లంతా అరెరే.. భలే చాన్సు మిస్ చేసుకున్నామని అనుకోవటం ఖాయం. ఇలా పుష్పలో ఛాన్సును మిస్ చేసుకున్న వారి జాబితా పెద్దదే.
 
తొలుత హీరో విషయానికి వస్తే.. మొదట పుష్పరాజ్ గా అనుకుంది సూపర్ స్టార్ మహేశ్ ను. నేనొక్కడినే తీసిన తర్వాత దర్శకుడు సుకుమార్ ఆయన్ను వెళ్లి కలిసి.. మహేశ్ తో ఒక పక్కా మాస్ మూవీ చేయాలన్న తన ఆలోచనను షేర్ చేశారట. ఆ సినిమాలో క్యారెక్టర్ లుక్స్ పరంగా వివిధ రకాలుగా కనిపించాల్సి రావటం.. వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో మహేశ్ పుష్పరాజ్ క్యారెక్టర్ కు నో చెప్పేయటం.. దీంతో అల్లు అర్జున్ కు చేరువైంది. అతడి ఇమేజ్ ను మొత్తంగా మార్చేసింది.

ఈ సినిమాలో శ్రీవల్లిగా అనుకున్నది రష్మికను కాదు. మొదట ఆ పాత్రకు సమంతనే అనుకున్నారు. రంగస్థలంలో రామలక్ష్మీగా మెప్పించిన ఆమెను శ్రీవల్లిగా చూపించాలని సుకుమార్ అనుకున్నా.. వేర్వేరు కారణాలతో ఆమె  నో చెప్పేశారు. దీంతో.. ఆ అవకాశం రష్మిక కు వెళ్లింది. అయితే.. సినిమాలో శ్రీవల్లి పాత్రను మిస్ చేసుకున్న సమంత.. అనూహ్యంగా.. ఊ ఊ అంటావా ఐటెం సాంగ్ కు ఓకే చెప్పటం.. అది కాస్తా సమంత ఇమేజ్ ను టోటల్ గా మార్చేయటమే కాదు.. ఆమె ఎంత హాటీ అన్న విషయాన్ని ఈ పాట కళ్లకు కట్టినట్లుగా చూపించింది.

ఇక.. ఈ సినిమాలో ఊఊ అంటావా పాట ఎంతటి క్రేజ్ ను సొంతం చేసుకున్నది తెలిసిందే. తొలుత ఈ పాటను సమంత చేత చేయించాలని అనుకోలేదట. మొదట దర్శకుడి ఆప్షన్ దిశా పటానీగా అనుకున్నారు. ఆ తర్వాత నోరా ఫతేహి అనుకున్నారు. చివర్లో నోరానే చేస్తుందని అనుకున్నా.. అమ్మడు డిమాండ్ చేసిన భారీ పారితోషికంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. చివర్లో సమంత ఓకే చెప్పటం.. అది కాస్తా ఎంతటి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక.. పుష్పలో విలన్ క్యారెక్టర్ కు ఉన్న ప్రాధాన్యత ఎంతన్నది తెలిసిందే. భన్వర్ లాల్ షెకావత్ పాత్రను తొలుత విజయ్ సేతుపతితో అనుకున్నారట. ఆయన డేట్లు కుదరకపోవటంతో బెంగాలీ నటుడు జిష్ణు సేన్ గుప్తను అనుకున్నారు. అది కాలేదు. టాలీవుడ్ హీరో నారా రోహిత్ కు వినిపించినా అతను ఓకే చెప్పలేదు. చివరకు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కు కథ నచ్చటంతో ఓకే చెప్పటం.. టాలీవుడ్ కు విలన్ గా ఎంట్రీ ఇచ్చేశారు. ఇలా దర్శకుడి మొదటి ఆప్షన్ కు పలువురు నో చెప్పటం.. ఆయన తర్వాతి ఆప్షన్ అతికినట్లుగా సినిమాలోని పాత్రలకు సెట్ కావటం చూస్తే.. తొలుత నో చెప్పటమే సుకుమార్ కు కలిసి వచ్చిందన్న భావన కలుగక మానదు.
Tags:    

Similar News