మొహం చాటేసి వారిప్పుడు వెంట పడుతున్నారట

Update: 2019-06-17 08:29 GMT
బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా చిత్రాల్లో నటిస్తూ దూసుకు పోతుంది. బాలీవుడ్‌ లో మంచి ఫామ్‌ లో ఉన్న సమయంలోనే ఈమె టాలీవుడ్‌ లో 'భరత్‌ అనే నేను' మరియు 'వినయ విధేయ రామ' అనే చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలతో సౌత్‌ ఆడియన్స్‌ కు దగ్గరయిన కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్‌ లో పలు చిత్రాల్లో నటిస్తూ ఉంది. ఈమె నటించిన అర్జున్‌ రెడ్డి రీమేక్‌ 'కబీర్‌ సింగ్‌' విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సందర్బంగా కియారా అద్వానీ మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్‌ లో ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి మాట్లాడటం జరిగింది.

తన మొదటి సినిమా ఫ్లాప్‌ అయిన సమయంలో పలువురు దర్శకులు నన్ను కనీసం కలిసేందుకు కూడా ఆసక్తి చూపించలేదు. నాకు మొహం చాటేసేవారు. ఎప్పుడైతే నాకు 'ధోనీ' తో సక్సెస్‌ దక్కిందో అప్పటి నుండి కూడా పూర్తిగా మారిపోయింది. గతంలో నాకు మొహం చాటేసిన వారు ఇప్పుడు నా వెంట పడుతున్నారు. అన్ని సినిమాలకు డేట్లు ఇవ్వడం కాస్త కష్టమే అయినా మంచి ప్రాజెక్ట్‌ ల్లో నటించేందుకు ఎక్కువ కష్టపడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.

కేవలం బాలీవుడ్‌ అని.. హిందీ భాషకే అని పరిమితం కాకుండా మొత్తం ఇండియాలోని అన్ని భాషల్లో కూడా నటించాలని తాను కోరుకుంటున్నట్లుగా ఈ సందర్బంగా కియారా అద్వానీ చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ గా అన్ని భాషల్లో గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొంది. సినిమాలనే కాకుండా బుల్లి తెరపై కూడా నటించేందుకు తాను సిద్దమంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ తో ఒక చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడితో సౌత్‌ నిర్మాతలు కూడా చర్చలు జరుపుతున్నారని సమాచారం అందుతోంది.
Tags:    

Similar News