RRR విడుదలై సంచలన వసూళ్లను సాధించింది. తొలి రెండు వారాలు బంపర్ వసూళ్లతో మోత మోగించింది. ఈ సినిమా ఇంటా బయటా సాధించిన అఖండ విజయాన్ని రాజమౌళి అండ్ టీమ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చరణ్ - తారక్ లకు కెరీర్ బెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది ఆర్.ఆర్.ఆర్. మూడో వారంలోనూ హిందీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.
ఇప్పటికీ మల్టీప్లెక్స్ సహా ఇతర సింగిల్ థియేటర్లలో ఉత్తరాదిన అద్భుత వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా వసూళ్లకు మునుముందు గండి పడనుందా? అంటే అవుననే గుసగుస వినిపిస్తోంది.
ఈ వారం హారీ పోటర్ సిరీస్ నుంచి అదిరిపోయే సినిమా శుక్రవారం నాడు వస్తోంది. హ్యారీపోటర్.. సీక్రెట్స్ ఆఫ్ ఆల్బస్ డంబుల్ డోర్ సంచలనాలకు రెడీ అవుతోంది. బుక్ మై షో సహా అన్ని చోట్లా ఈ మూవీకి బుకింగులు బావున్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇది మోత మోగిస్తుందనే భావిస్తున్నారు. అన్ని మల్టీప్లెక్సులు కిటకిటలాడే ఛాన్సుందని అంచనా. లోకల్ సినిమాల కంటే హ్యారీ పోటర్ కి క్రేజ్ ఎక్కువ కనిపిస్తోంది.
ఇప్పటికే ముందస్తు రివ్యూలతో మోత! హ్యారీ పాటర్ స్పిన్ ఆఫ్ సిరీస్ నుంచి "ఫెంటాస్టిక్ బీస్ట్స్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్ డోర్" మొదటి సమీక్షలు ఇప్పటికే విడుదలయ్యాయి. 8 ఏప్రిల్ 2022న భారతదేశంలో విడుదల కాగా రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి.
కొంతమంది హ్యారీ పాటర్ స్పిన్‌ఆఫ్ సిరీస్ ను 'మంచి స్వభావం గల వినోదం` అని పొగిడేశారు. చాలా మంది తాజా మూవీ గత సినిమాల కంటే మించి ఒక ఎడ్జ్ థ్రిల్ ని కలిగి ఉన్నందుకు ప్రశంసించారు. మాంత్రిక ప్రపంచంలో ప్రజల ఆసక్తిని రేకెత్తించే "మాయాజాలం మరీ అంతగా లేదు" అనే వాదనలు ఉన్నాయి.
రాటెన్ టొమాటోస్ ఈ చిత్రానికి 60 శాతం ఫ్రెష్ స్కోర్ ని అందించింది. రెండవది 36 శాతం స్కోర్ తో పోలిస్తే చాలా కావాల్సిన అంచుని అందించింది. అయితే ఈ సిరీస్ లో అనేక చిత్రాల తో పోలిస్తే ప్రేక్షకులను మాంత్రికుల ప్రపంచంలోకి ఆకర్షించిన మాయాజాలం చాలా వరకు లేదు అని పేర్కొంది. ఫన్టాస్టిక్ బీస్ట్స్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్డోర్ మొదటి సమీక్షలు ..ది గార్డియన్ పీటర్ బ్రాడ్ షా ద్వారా మూడు నక్షత్రాల రేటింగ్ ను అందుకుంది. హారీ పోటర్ పై మిశ్రమ స్పందనలు కొన్నిచోట్ల కనిపిస్తున్నాయి.