థ‌ర్డ్ వేవ్ ఇంపాక్ట్.. ఆర్డ‌ర్ ఛేంజ్..రిలీజ్ లు ఏప్రిల్ త‌ర్వాతే!

Update: 2022-01-05 07:30 GMT
క‌రోనా కొత్తే వేరియంట్ ఓమిక్రాన్.. సెకెండ్ వేవ్ మాదిరి ఒక్క‌సారిగా పెర‌గ‌డంతో దేశంలో థ‌ర్డ్ వేవ్ మొద‌లైంద‌ని కేంద్రం ధృవీక‌రించింది. ఇప్ప‌టికే దేశ రాజ‌ధాని ఢిల్లీలో థియేట‌ర్లు మూసేసారు మ‌హరాష్ర్ట‌..త‌మిళ‌నాడు..ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ర్టాలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ని న‌డుపుతున్నాయి. వ‌చ్చే రెండు..మూడు వారాల్లో కేంద్రం కోవిడ్ ఆంక్ష‌ల్ని మ‌రింత క‌ఠిన‌త‌రం చేయ‌నుంది. దీంతో పాన్ ఇండియా చిత్రాల రిలీజ్ లు అన్ని ఒక్క‌సారిగా వాయిదా ప‌డ్డాయి. నిర్మాణ సంస్థ‌లు న‌ష్టాల్ని ముందే ఊహించి త‌మ చిత్రాల్ని వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి.

ఇండియాస్ మెస్ట్ అవైటెడ్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` వాయిదా ప‌డింది. `రాధేశ్యామ్` వాయిదా దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇక బాలీవుడ్ నుంచి `జెర్సీ`..`పృథ్వీరాజ్` చిత్రాల్ని వాయిదా వేస్తున్న‌ట్లు ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు ప్ర‌క‌టించాయి. అయితే ఈ చిత్రాలు వాయిదా ప‌డ‌టంతో `శంషేరా`.. `జ‌యేష్ భాయ్ జోర్డార్` చిత్రాల‌పై దెబ్బ ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఎలారా క్యాపిట‌ల్ ట్రేడ్ నిపుణుడు క‌ర‌ణ్ తౌరానీ సినిమాల భ‌విత‌వ్యాన్ని విశ్లేషించారు. ప్ర‌స్తుతం భారీ బ‌డ్జెట్ చిత్రాలేవి రిస్క్ తీసుకోవ‌డానికి ఇష్ట ప‌డ‌వు. రాబోయే మూడు నెల‌ల వ‌ర‌కూ ఎలాంటి సినిమా రిలీజ్ కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఫిబ్ర‌వ‌రి..మార్చి వ‌ర‌కూ థ‌ర్డ్ వేడ్ ఉంటుంద‌ని.. రిలీజ్ లు అన్ని ఏప్రిల్ త‌ర్వాత‌నే ఉండే అవ‌కాశం ఉందని విశ్లేషించారు. 2022 థియేట్రిక‌ల‌ర్ రిలీజ్ క్యాలెండ‌ర్ ఆర్డ‌ర్ మొత్తం ఛేంజ్ అవుతుంద‌ని మ‌రో అనలిస్ట్ సుమిత్ కాడెల్ తెలిపారు. ఉదాహ‌ర‌ణ‌కు `ఆర్ ఆర్ ఆర్` వాయిదాతో మిగ‌తా సినిమా రిలీజ్ ల‌కి ఆట‌కం ఏర్ప‌డ‌టం. ఇలా సినిమాలు వాయిదా ప‌డేకొద్ది నిర్మాత‌కు వడ్డీల భారం పెరిగిపోతుంద‌ని త‌రౌనీ అన్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఎగ్జిబిట‌ర్లు..డిస్ర్టిబ్యూట‌ర్ల మ‌ధ్య అండ‌ర్ స్టాండింగ్ ఉండాల‌న్నారు. అయితే సెకెండ్ వేవ్ అంత ప్ర‌భావం థ‌ర్డ్ వేవ్ లో ఉండ‌ద‌ని ..అంతంగా ఆందోళ‌న చెందాల్సి ప‌నిలేద‌న్నారు త‌రౌనీ.


Tags:    

Similar News