ఆ ముగ్గురికి ఈ ఫ్రైడే మ‌ర్చిపోలేని రోజు!

Update: 2022-09-09 07:54 GMT
కొంత మందికి త‌మ ప్ర‌యాణంలో ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భాలు, ప్ర‌త్యేక‌మైన మ‌ర్చిపోలేని రోజులు వుంటాయి. అక్కినేని జంట కింగ్ నాగార్జున‌, అమ‌ల అక్కినేనికి, యంగ్ హీరో శ‌ర్వానంద్ కి సెప్టెంబ‌ర్ 9 ఈ ఫ్రైడే చాలా ప్ర‌త్యేక‌మైన రోజుగా నిలిచిపోనుంది. కార‌ణం చాలా ఏళ్ల విరామం త‌రువాత నాగార్జున బాలీవుడ్ లో న‌టింటిచిన మూవీ 'బ్ర‌హ్మాస్త్ర‌'. ర‌ణ్ బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్ జంట‌గా అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కించిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

మ‌న పురాణాల ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో నంది అస్త్రంగా కీల‌క పాత్ర‌లో కింగ్ నాగార్జున న‌టించారు. ఈ మూవీని తెలుగులోనూ రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ‌లో రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

దాదాపు 20 ఏళ్ల త‌రువాత నాగార్జున హిందీలో రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. అంటే క‌మ్ బ్యాక్ ఫిల్మ్ అన్న‌మాట‌. ఇదే మూవీ రిలీజ్ అయిన రోజే అక్కినేని అమ‌ల న‌టించిన 'ఒకే ఒక జీవితం' ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తమిళ‌, తెలుగు భాష‌ల్లో బైలింగ్వ‌ల్ మూవీగా రూపొందింది. ఇందులో హీరోగా శ‌ర్వానంద్ న‌టించాడు.  

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌' అనంత‌రం ప‌దేళ్ల విరామం త‌రువాత అమ‌ల న‌టించిన సినిమా ఇది. ఇది కూడా అమ‌ల‌కు క‌మ్ బ్యాక్ ఫిల్మ్ కావ‌డం విశేషం. ఇక 'ఒకే ఒక జీవితం' సినిమాతో హీరో శ‌ర్వానంద్ త‌మిళంలో ఏడేళ్ల త‌రువాత రీఎంట్రీ ఇచ్చాడు.

ఇది త‌న‌కు కూడా అక్క‌డ క‌మ్ బ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. శుక్ర‌వారం నాగార్జున న‌టించగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన 'బ్ర‌హ్మాస్త్ర‌' యావ‌రేజ్ టాక్ ని సొంతం చేసుకుంటే అమ‌ల‌, శ‌ర్వానంద్ న‌టించిన 'ఒకే ఒక జీవితం' ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ గా సూప‌ర్ హిట్ టాక్ ని ద‌క్కించుకోవ‌డం విశేషం.

అక్కినేని నాగార్జున‌, అమ‌ల జంట కిరాయి దాదా, చిన‌బాబు, ట్రెండ్ సెట్ట‌ర్ 'శివ‌', ప్రేమ యుద్ధం, నిర్ణ‌యం సినిమాల్లో అల‌రించి ఆకట్టుకున్నారు. వీరిద్ద‌రి కెమిస్ట్రీ తెలుగు ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. 1919లో ప్రియ‌ద‌ర్శ‌న్ తెర‌కెక్కించిన 'నిర్ణ‌యం' త‌రువాత 1992లో ఈ జంట పెళ్లితో ఒక్క‌టైంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News