తెలుగు తెరపై అప్పటి వరకూ వచ్చిన హారర్ థ్రిల్లర్ కథలకు ఫుల్ స్టాప్ పెట్టేసి, అసలైన భయం ఎలా ఉంటుందనేది ఆడియన్స్ కి చూపించిన దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ కనిపిస్తాడు. ఆయన తెరకెక్కించిన హారర్ సినిమాల్లో 'దెయ్యం' ఒకటి. జేడీ చక్రవర్తి .. మహేశ్వరి .. జయసుధ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 1996లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజంగానే ఈ సినిమా భయంతో ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. అలాంటి ఈ సినిమా షూటింగులో జరిగిన ఒక సరదా సంఘటన గురించి 'ఆలీతో సరదాగా'లో మహేశ్వరి ప్రస్తావించింది.
'దెయ్యం' సినిమా షూటింగును వర్మగారు ఒక ఫామ్ హౌస్ లో ప్లాన్ చేశారు. ఆ ఫామ్ హౌస్ లో ఒక రెండు నెలల పాటు షూటింగ్ జరిగింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ షూటింగ్ పెట్టేవారు. ఆ ఫామ్ హౌస్ పరిసరాలే చాలా భయంకరంగా ఉంటాయి. మెయిన్ రోడ్ నుంచి ఫామ్ హౌస్ కి వెళ్లడానికి ఒక రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. ఒక కారు వెళ్లడానికి సరిపోయే దారి మాత్రమే ఉంటుంది. అటూ అటూ ఎత్తైన చెట్లు ఉంటాయి. ఒక రోజున 'గ్రేవ్ యార్డ్' సెట్ వేశారు .. తెల్లవారు జామున 1 గంటకు షూటింగ్ పెట్టారు. అది సెట్ అయినప్పటికీ అందరిలో ఒక రకమైన భయం ఉంది.
ఆ సమయంలో వర్మగారు "ఎవరైనా సరే ఈ సమయంలో ఒంటరిగా మెయిన్ రోడ్ వరకూ వెళ్లి వస్తారా? అలా వెళ్లి వచ్చినవారికి 50 వేలు ఇస్తాను" అన్నారు. నిజానికి మెయిన్ రోడ్ వరకూ వెళ్లే ఆ దారి చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు 'నేను వెళతాను రామూ గారు' అని అన్నాను. 'ఏంటి నువ్వు వెళ్తావా?' అని ఆయన ఆశ్చర్యంగా అడిగారు. 'వెళతాను' అన్నాను గానీ, లోపల మాత్రం చాలా భయంగా అనిపిస్తూనే ఉంది. అయినా వెళ్లి వచ్చాను .. కానీ ఇంతవరకూ ఆయన ఆ 50 వేలు మాత్రం ఇవ్వలేదు" అని చెప్పుకొచ్చింది.
ఇక 'వీరుడు' అనే సినిమా షూటింగులో మరో సంఘటన జరిగింది. అందులో వినోద్ కుమార్ గారు హీరో. సాంగ్ షూటింగు కోసం మహాబలేశ్వర్ తీసుకుని వెళ్లారు .. అక్కడ ఎటు చూసినా కొండలే. పెళ్లి కూతురు గెటప్ లో నేను గుర్రంపై ముందు కూర్చున్నాను .. వెనక వినోద్ కుమార్ కూర్చున్నారు. అంతకుముందే నేను వినోద్ కుమార్ గారిని అడిగాను 'సార్ మీకు హార్స్ రైడింగ్ వచ్చునా?' అని .. వచ్చని చెప్పారు. దాంతో నేను ధైర్యంగా కూర్చున్నాను. షూటింగు జరుగుతుండగా గుర్రం కంట్రోల్ తప్పిపోయింది. ఆయన పడ్డారు .. నేను కూడా పడ్డాను. గుర్రం కాళ్ల కుండా పడటం వలన అది నన్ను తొక్కి తొక్కి వదిలేసింది" అని చెప్పుకొచ్చింది.