టాలీవుడ్ హీరోల మ‌ధ్య సిస‌లైన వార్ ఇదే!

Update: 2022-11-21 14:30 GMT
రామ్ చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్..ప్ర‌భాస్...బ‌న్నీ...మ‌హేష్ ఈ స్టార్ల్ అంతా ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు. రీజ‌న‌ల్  బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డితే స‌రిపోదు. పాన్ ఇండియా బాక్సాఫీస్ నే షేక్ చేయాలి. 100 కోట్లు..200కోట్లు తెస్తామంటే కుద‌ర‌దు. మినిమంగా 500 కోట్లు అయినా రాబ‌ట్టాలి. దీంతో పాటు బాలీవుడ్ హీరోల్నిసైతం మార్కెట్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమీర్ ఖాన్..షారుక్ ఖాన్...స‌ల్మాన్ ఖాన్  లాంటి ఖాన్ వార‌సుల నుంచి క‌పూర్ హీరోల వ‌ర‌కూ వాళ్ల నుంచి ఎదుర‌య్యే పోటీ త‌ట్టుకుని నిల‌బ‌డాలి.

అప్పుడే ఈ హీరోల మ‌ధ్య ఎవ‌రి ద‌మ్ము ఎంత‌? అన్న‌ది తేలేది. అవును ఇవ‌న్నీ స‌రిపోల్చి చూస్తుంటే?  అస‌లైన బాక్సాఫీస్ వారు ఇప్పుడే మొద‌లైంది అనిపిస్తుంది.  ప్ర‌స్తుతం మ‌న హీరోలంతా  అలాంటి కంటెంట్  ఉన్న సినిమాలతోనే బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతున్నారు.  మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 15వ చిత్రానికి దేశం గ‌ర్వించ‌ద‌గ్గ దర్శ‌కుడు శంక‌ర్ ప‌నిచేస్తున్నారంటే? ఆ సినిమాపై ప్ర‌పంచ వ్యాప్తంగానే భారీ అంచ‌నాలు నెల‌కొంటాయి.

రోబో లాంటి టెక్నిక‌ల్ స్టాండ‌ర్డ్  సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ శంక‌ర్ కి ఆ ఇమేజ్ని తెచ్చి పెట్టింది. ఇక నేష‌న‌ల్ ప‌రంగా ఆయ‌న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక  మోస్ట్ వాంటెడ్ హీరోల జాబితాలో డార్లింగ్ ప్ర‌భాస్ ఎప్పుడో చేరిపోయారు. 'బాహుబ‌లి'తోనే డార్లింగ్ పై పాన్ ఇండియా స‌క్సెస్ అనే ఒత్తిడి పీక్స్ కి చేరింది. ప్ర‌స్తుతం ఆయ‌న లైన‌ప్ లో ఉన్న సినిమాలపై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

ప్రాజెక్ట్ -కె..స‌లార్...స్పిరిట్ ..ఆదిపురుష్ అన్ని ఇండియ‌న్ ని షేక్ చేసే  సినిమాలే. అలాగే  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తో నేష‌న‌ల్ లెవ‌ల్లో వెలిగిపోతున్నాడు. దీంతో రెండ‌వ భాగం పుష్ప‌పై అంచ‌నాలు ప‌తాక స్థాయిలో ఉన్నాయి. పోటీనీ త‌ట్టుకోవాలంటే కంటెంట్ యూనివ‌ర్శ‌ల్గా ఉండాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ ఏకంగా అంత‌ర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

సుకుమార్ ఈ పోటీని ముందే అంచ‌నా వేసి ప్లీ ప్లాన్డ్ గా బ‌రిలోకి దిగుతున్నారు. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో రాజ‌మౌళి ఏకంగా భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ నే చేస్తున్నారు. గ్లోబ‌ల్ స్థాయిలో స‌క్స‌స్ కొట్టాల‌న్న‌ది జ‌క్క‌న్న ప్లాన్. ఆ ర‌కంగా స్ర్కిప్ట్  ని డిజైన్ చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది సినిమా ప్రారంభం అవుతుంది. రిలీజ్ ఎప్పుడ‌న్న‌ది  చెప్ప‌లేదు కాబ‌ట్టి....ఆ తేదీ ఊహ‌కి కూడా సాధ్య‌మైంది కాదు.

ఇక  యంగ్ టైగ‌ర్  ఎన్టీఆర్ కొర‌టాల‌తోనే పాన్ ఇండియా హిట్  అందుకోవాల‌ని ద‌ర్శ‌కుడ్ని సాన‌బెడుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే సంగీత ద‌ర్శ‌కుడిగా నేష‌న‌ల్ గా పాపులర్ అయిన‌  అనిరుద్ ని ఎంపిక చేసారు.  దీన్ని  టైగ‌ర్ స్ర్టాట‌జీని అంచ‌నా వేయోచ్చు. ఇంకా కొంత మంది మీడియం రేంజ్ హీరోలు సైతం పాన్ ఇండియా రేసులో ఉన్నారు.  ఆ ర‌కంగా టాలీవుడ్ పాన్ ఇండియా హీరోల చిత్రాలు ఒక్కొక్క‌టిగా  బాక్సాఫీస్ వార్ లోకి దిగ‌బోతున్నాయి. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News