కొన్ని సినిమాలు కథ పరంగా బాగున్నా స్క్రీన్ పైకి వచ్చే సరికి తేడా కొడుతుంది. వెంటనే ఆడియన్స్ తమకి సినిమా నచ్చలేదని ఒక్క ముక్కలో తేల్చేసి పక్కన పెడతారు. అయితే కొన్ని కథ చర్చల్లోనే రిజల్ట్ పసిగట్టేయొచ్చు. అయితే నాగ శౌర్య కి ఇలాంటి ఓ అనుభవమే జరిగిందట.
'ఛలో' తో సొంత బ్యానర్ స్థాపించి సూపర్ హిట్ కొట్టిన నాగ శౌర్య ఆ తర్వాత 'నర్తనశాల' అనే సినిమా తీసాడు. అది ఘోరమైన అపజయం అందుకొని నాగ శౌర్య కుటుంబానికి లాస్ తీసుకొచ్చింది. ఇప్పుడు సొంత బ్యానర్ లో మూడో సినిమా చేసాడు. ఈ సినిమా ప్రెస్ మీట్ లో 'నర్తన శాల' రిజల్ట్ ముందే ఊహించామని అందుకే ఆ సినిమా ఫంక్షన్ లో సినిమా నచ్చక పోతే ముగ్గురికి చెప్పండి అంటూ అన్నానని చెప్పాడు శౌర్య. ఎవరూ తమ సినిమా చూస్తూ బాబోయ్ అనుకోకూడదని తెలిపాడు.
అయితే ఆ సినిమాను దర్శకుడికి ఒకప్పుడు ఇచ్చిన మాట వల్లే చేసానని , తన దృష్టిలో మాట నిలబెట్టుకోకపోతే చని పోయినట్టే అంటూ చెప్పుకున్నాడు. సో అన్నీ తెలిసినా ఇచ్చిన మాట మీద నిలబడి నిర్మాత గా డబ్బు పోగుట్టుకున్నాడన్నమాట శౌర్య.