మార్చి 8 .. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మేకర్స్ స్ఫూర్తివంతమైన తమ సినిమాల పోస్టర్లు వీడియోలతో గ్లింప్స్ ను ఆడియెన్ కోసం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అందుకు భిన్నంగా ఆర్జీవీ ఏం చేయబోతున్నారు? అంటే.. ఇదిగో ఇప్పుడు బాంబ్ లాంటి వార్త చెప్పారు.
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నేటి సాయంత్రం 5 గంటలకు పూజా బాలేకర్ వర్కవుట్ వీడియోను లాంచ్ చేస్తున్నానని ప్రకటించారు. `లడ్కీ- ఎంటర్ ది గర్ల్ డ్రాగన్` చిత్రంతో సంచలనంగా మారిన పూజా బాలేకర్ వేడెక్కించే వర్కవుట్ వీడియోలు ఇప్పటికే అంతర్జాలాన్ని షేక్ చేశాయి. ఇప్పుడు అంతకుమించి అనే రేంజులో మరో వర్కవుట్ వీడియోని రామూజీ వదల బోతున్నాడన్నమాట. అయితే టైమ్ చూసి టైమ్ బాంబు పేల్చడంలా ఆయన నిర్ణయం ఏంటో కానీ ఉమెన్స్ డే రోజున మరీ ఇలా టార్గెట్ చేస్తున్నారు? అంటూ ఇప్పటికే విమర్శల ఝడివాన మొదలైంది.
ఆర్జీవీ ఏం చేసినా అంతేగా.. ఏదో ఒక సంథింగ్ ఉంటుందిగా! అంటూ యూత్ గుసగుసలాడుతున్నారు. ఆర్జీవీనా మజాకానా? లోకం మొత్తానిది ఒక దారి అయితే తానొక్కడే తన దారిలో సపరేట్ గా వెళతాడు. గుంపులో గొర్రెలా ఆయన ఆలోచించరు. అంతా నా ఇష్టం అంటాడు. గాళ్స్ తో చిందులేస్తాడు.. వోడ్కాలో మునిగి తేల్తాడు! ఆయనంతే!!
హంగామా సరే .. రిలీజ్ ఎప్పుడు?
రెండేళ్లుగా ఎంటర్ ది గర్ల్ డ్రాగన్.. అంటూ ఆర్జీవీ హంగామా గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన చైనా బేస్డ్ మార్షల్ ఆర్ట్స్ సినిమా తీస్తున్నానని ఒక అమ్మాయి నటిస్తుందని ప్రకటించగానే షాకయ్యారు జనం. ముందే చెప్పినట్టే గర్ల్ డ్రాగన్ అంటూ బ్రూస్ లీని పిచ్చిగా ఆరాధించే యువతి జీవితాన్ని ఆర్జీవీ తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాకి గర్ల్ డ్రాగన్ అని టైటిల్ ని మార్చడం ఒక ఎత్తుగడ. పూజా బాలేకర్ కథానాయిక గా నటించింది.
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యమే అయినా అమ్మాయిని ఇంచి ఇంచి కొలతలు కొలిచి మరీ ఒంపుసొంపుల్ని రంగరించేలా ఆర్జీవీ ఈ మూవీని తెరకెక్కించారు. అసలు ఆర్జీవీ లెన్సే వేరు.. ఆయన సెన్సే వేరు! ఆ కళ్లలోంచి కథానాయికను చూసే తీరే వేరు! అనిపిస్తున్నారు. లేడీ బ్రూస్లీ పేరుతో కల్లోలమే ఇది అనేలా ఈ సినిమా విజువల్స్ వేడెక్కిస్తున్నాయి. ఇంతకుముందు రిలీజ్ చేసిన దమ్ము సాంగ్ అంతకుమించి అనే రేంజులో ఉంది. బీచ్ లో అమ్మాయి బికినీ వీరంగం అథ్లెటిక్ ఫీట్స్ ప్రతిదీ కుర్రాళ్లకు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీట్ నిచ్చాయి. రిలీజ్ ముందే లాభాలు కొల్లగొట్టిన ఆర్జీవీ టీమ్ ఈ చిత్రాన్ని ఇండియా సహా చైనాలోనూ రిలీజ్ చేస్తానని చెబుతున్నారు.
ఇంటర్నేషనల్ సినిమా అంటూ ఇందులో లేడీ బ్రూస్లీ గ్లామర్ విన్యాసాల్ని చూపించారు కాబట్టి విదేశాల్లోనూ ఈ మూవీ మార్కెట్ అయ్యింది. ఇంతకుముందు బ్రూస్ లీ జయంతి కానుకగా టీజర్ ని ఆ తర్వాత ట్రైలర్ ని రిలీజ్ చేస్తే అంతర్జాలంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బ్రూస్ లీ సొంత నగరం చైనా- ఫోషన్ సిటీలో టీజర్ ని రిలీజ్ చేసారు. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిస్తున్న ఆర్జీవీ చైనాలోనూ భారీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ వల్ల ఆలస్యమైంది. తర్వాత డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేసినా కుదరలేదు. ఈ చిత్రం హిందీలో లడ్కీ .. తమిళంలో అమ్మాయి పేరుతోనే రిలీజ్ కానున్నాయి. ఇప్పటికీ రిలీజ్ తేదీపై డైలమా అలానే ఉంది.