గురువు స్థానం ఎప్పుడూ చాలా విలువైనదే. అందుకే భారతదేశం లో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ని టీచర్స్ డే అంటూ జరుపుకుంటాం. మనకు చదువు చెప్పిన గురువులు.. మంచి మార్గంలో నడిపించిన గురువులను గౌరవించుకుంటాం. ఇది సీరియస్ ఎఫైర్. ఇందులో జోక్స్ కి స్థానం లేదు.
కానీ గురు శిష్య బంధం అన్ని చోట్ల ఇలా సీరియస్ గా సాగదు. 'RX 100' దర్శకుడు అజయ్ భూపతి తన గురువు గారు రామ్ గోపాల్ వర్మ కు టీచర్స్ లిక్కర్ బాటిల్ ఫోటో పెట్టి వెరైటీగా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఇక వీళ్ళు కాకుండా 'వెంకీ' సినిమాలో రవి తేజ తను చేసే ప్రతి పనికి ముందు "గురూజీ... గురూజీ" అంటూ జ్యోతిష్యం చెప్పే మల్లిఖార్జున రావు వెంటబడుతుంటాడు. ఇక 'అదుర్స్' సినిమాలో ఎన్టీఆర్ బ్రహ్మానందాన్ని 'గురువుగారు.. గురువుగారు' అంటూ సూపర్ కామెడీ పండిస్తాడు. ఇక అలాంటి సెటప్పే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు 'అరవింద సమేత' లో ఎన్టీఆర్ కు సెట్ చేసి పెట్టాడట.
ఇంతకీ మన టాలీవుడ్ గురూజీ యంగ్ టైగర్ కు సెట్ చేసిన ఆ గురువుగారు ఎవరంటే సునీల్. సినిమాలో దాదాపు 90% సీన్స్ లో సునీల్ కనిపిస్తాడట.. ఒక డ్యూయెట్ లో కూడా 'గురువుగారు' దర్శనం ఇస్తాడట. ఇక ఎన్టీఆర్ ప్రతి పనికి ముందు... వెనుక .. 'గురువుగారు గురువుగారు' అంటూ అతిగౌరవం ఇస్తూ కామెడీ పండిస్తాడట. మరి ఫైట్ లో కత్తి పట్టుకునే సమయంలో .. హీరోయిన్ ను లైన్ లో పెట్టేసమయంలో..ఇలా అన్నీ సీన్లలో వీరరాఘవుడు 'గురువుగారు' అనడం మర్చిపోడట.. చూస్తుంటే.. తన స్నేహితుడి కోసం మంచి కామెడీ ట్రాక్ రెడీ చేసి పెట్టినట్టున్నాడు గురూజీ.