సరైన హిట్ సినిమాలకు లేక థియేటర్లు వెల వెలబోతున్నాయి. `ఆర్ ఆర్ ఆర్`..`మేజర్`..`ఎఫ్-3` లాంటి చిత్రాలు తర్వాత రిలీజ్ అయిన చిత్రాలేవి చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. థియేటర్లో సక్సెస్ అయిన సినిమాలే ఓటీటీలోనూ ఆదరణకు నోచుకుంటున్నాయి. అయితే ఈ చిత్రాల నుంచి `విరాటపర్వం` ని మినహాయించాల్సి ఉంది.
థియేటర్లో పెద్దగా ఆదరణకు నోచుకోనప్పటికీ ఓటీటీలో ఈ సినిమా మంచి వ్యూస్ ని దక్కించుకుని ట్రెండింగ్ లో నిలిచింది. నెట్ ప్లిక్స్ రేటింగ్ ని మెరుగుపరిచింది.
ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలేవి పెద్దగా ఆదరణకి నోచుకోలేదు. ఈ వారం ఓటీటీ లో కొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. గోపీచంద్ కథానాయకుడిగా నటించిన `పక్కా కమర్శియల్` ఓటీటీలో రేపటి నుంచి స్ర్టీమింగ్ కానుంది.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా థియేటర్లోనూ అంతగా మెప్పించలేదు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై పెద్దగా బజ్ లేదు. సదరు సంస్థలు చెప్పుకోదగ్గ ప్రచారం కూడా చేయలేదు. తెలుగు నుంచి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఒకే ఒక్క చిత్రమిది. అలాగే లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన `హ్యాపీ బర్త్ డే` కూడా ఆగస్ట్ 8 నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అవుతుంది.
థియేటర్ రిలీజ్ లో ఈ సినిమా విజయం సాధించలేదు. దీంతో ఓటీటీలోనూ పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు. ఇలా ఈ వారం కూడా ఓటీటీ రిలీజ్ లు తెలుగు నుంచి చప్పగానే కనిపిస్తున్నాయి. మరి వాటి రిలీజ్ తర్వాత ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక అలియాభట్ నటించిన `డార్లింగ్స్` కూడా ఆగస్ట్ 5న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా కాస్తా..కూస్తో చెప్పుకోదగ్గ చిత్రంగా టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమాపై కాస్త ఎగ్జైట్ మెంట్ చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి పూర్తి స్థాయిలో తెలుగు వెర్షన్ ఓటీటీ మళ్లీ ఊపందుకోవాలంటే హిట్ కంటెంట్ రావాల్సిందే. అప్పటివరకూ ఆడియన్స్ హాలీవుడ్..ఇంగ్లీష్ సినిమాలతో టైంపాస్ చేయాల్సిందే.