రామ్‌గోపాల్ వర్మ తీసిన చెత్త సినిమాల జాబితాలోకి '365 డేస్' కచ్చితంగా చేరదు. గత కొన్నేళ్లలో వర్మ తీసిన చాలా సినిమాల కంటే '365 డేస్' బెటర్ అనే చెబుతున్నారు. ఐతే '365 డేస్' తప్పక చూడాల్సిన సినిమా మాత్రం కాదన్నది చూసిన ఆడియన్స్ అభిప్రాయం. నందు, అనైకల పెర్ఫామెన్స్ కోసం.. అనైక అందాల కోసం.. కొన్ని మంచి సన్నివేశాల కోసం ఈ సినిమా ఓసారి చూడొచ్చేమో.
ఇక శుక్రవారం విడుదలైన మరో తెలుగు సినిమా 'మోసగాళ్లకు మోసగాడు'. డీకే బోస్ అనే విడుదలకు నోచుకోని సినిమాకు దర్శకత్వం వహించిన బోస్ నెల్లూరి తన రెండో ప్రయత్నంగా సుధీర్ బాబు హీరోగా తీసిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కామెడీ కోసం ఓసారి చూడొచ్చని కొంతమంది అంటుంటే.. థ్రిల్ లేదని.. గ్రిప్పింగ్‌గా లేదని.. సిల్లీగా ఉందని.. ఇంకొందరు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
ఇక ఈ రెండు తెలుగు సినిమాలకు పోటీగా రిలీజైన తమిళ డబ్బింగ్ మూవీ 'ఎంతవాడు గాని..'కి మాత్రం మంచి టాక్ వస్తోంది. గౌతమ్ తీసిన స్టైలిష్ కాప్ మూవీస్ స్టయిల్లోనే 'ఎంతవాడు గాని..' కూడా డీసెంట్‌గా ఉందని అంటున్నారు ఆడియన్స్. ఐతే పెద్దగా పబ్లిసిటీ లేకుండా సినిమాను విడుదల చేయడం మైనస్ అయింది. మౌత్ టాక్‌తో పుంజుకుంటే పోటీలో ఉన్న రెండు తెలుగు సినిమాలను అజిత్ మూవీ దెబ్బ కొట్టడం ఖాయం.