శాకుంతలం పై ఆ రూమర్స్ నిజం కాదు

Update: 2023-04-08 15:04 GMT
సమంత నటించిన శాకుంతలం సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. శకుంతల పాత్రలో సమంతను చూడటానికి సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శకుంతల - దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు సమర్పణలో నీలిమా గుణ నిర్మించారు.

ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన శాకుంతలం ఎట్టకేలకు విడుదల అవుతున్నందుకు సాధారణ సినీ ప్రేక్షకుడు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదల వేళ ఓ టాక్ సినీ ప్రేక్షకులను, సమంత అభిమానులను కలవరపెడుతోంది. అయితే అవి కేవలం రూమర్స్ అని అందులో ఎలాంటి నిజం లేదని తాజాగా క్లారిటీ వచ్చేసింది.

శాకుంతలం మూవీని రాధాకృష్ణ ఎంటర్ టైన్మెంట్స్ అమెరికాలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అమెరికా డిస్ట్రిబ్యూటర్ గా రాధాకృష్ణ ఎంటర్ టైన్మెంట్స్ నుండి తప్పుకున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని, రాధాకృష్ణ ఎంటర్ టైన్మెంట్స్ ద్వారా శాకుంతలం సినిమాను విడుదల చేస్తామని డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ ఇచ్చారు.

ఏప్రిల్ 14వ తేదీన విడుదల కానున్న శాకుంతలం సినిమాకు ప్రస్తుతం ఎలాంటి పోటీ లేకపోవడం సానుకూలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో దసరా మూవీ ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

మరోవైపు రావణాసుర వచ్చినప్పటికీ ఇప్పటికైతే పెద్దగా టాక్ వినిపించడం లేదు. ఒకవేళ రావణాసుర మంచి కలెక్షన్లు రాబట్టినా శాకుంతలం సినిమా వచ్చేటప్పటికీ సందడి తగ్గే అవకాశం ఉంది.

శాకుంతలం ప్రచారాన్ని భుజాలపైకెత్తుకున్న సమంత తన స్థాయికి తగ్గ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయి ఉంది. దీని వల్ల శాకుంతలం ఓపెనింగ్స్ బాగుంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్, అద్భుతమైన గ్రాఫిక్స్, సమంత లీడ్ రోల్, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ స్పెషన్ అప్పీయరెన్స్ ఇవన్నీ శాకుంతలం సినిమాకు కలిసివచ్చేలా కనిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News