యాత్రలో ఆ పెద్దాయన చిల్ తాతేనా!

Update: 2019-02-08 11:41 GMT
ఇవాళ విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న యాత్ర మీద రాజకీయ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. నేరుగా ప్రస్తావించకపోయినా మనదేశం అంటూ పచ్చ రంగులో ప్రతిపక్ష పార్టీని చూపించి ఫోన్ లో  బ్రీఫ్డ్ మీ అంటూ అధినేత గొంతుని వినిపించి ఎవరి గురించో ఈజీగా గెస్ చేసే హింట్ ఇచ్చాడు దర్శకుడు మహి రాఘవ్. ఇకపోతే ఇందులో వైఎస్ఆర్ అప్పట్లో కాంగ్రెస్ అధిష్ఠానంతో సై అంటే సై అనేలా ధిక్కార స్వరాన్ని వినిపించే సన్నివేశాలు బాగా పేలాయి. రాజీ ధోరణి లేకుండా తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకోకుండా ఎవరైతే నాకేంటి అనే రీతిలో వైఎస్ ఆర్ దూకుడుని చూపించి తీరు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది.

అయితే వైఎస్ ఆర్ మీద అసంతృప్తితో ఉన్న స్వపక్ష సభ్యుల్లో కొందరిని చూపించడం వాళ్ళు ఎవరా అనే ఆసక్తి రేపెలా చేసింది. ముఖ్యంగా తోటపల్లి మధు వేసిన పాత్ర వేషధారణ బాష వ్యంగ్యంగా విసుర్లు వేసే తీరు అంతా సీనియర్ నేత విహెచ్ హనుమంతరావును గుర్తు చేసినట్టు ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

ఆ మధ్య అర్జున్ రెడ్డి పోస్టర్ల మీదున్న లిప్ లాక్ కిస్సుల మీద ఫైర్ అయిపోయి వాటిని చించేసి రచ్చ చేసిన విహెచ్ మీద విజయ్ దేవరకొండ చిల్ తాతయ్య అంటూ తన ఫేస్ బుక్ లో కామెంట్ పెట్టడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ,మళ్ళి ఇప్పుడు యాత్రలో ఏకంగా ఆయన పాత్రనే చూపించడంతో రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. అన్నట్టు ఈ పాత్ర వైఎస్ ఆర్ గురించి చెబుతూ ఏకవచనంలో వాడు వీడు అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఇది ఆయన పాత్రే అని జర్నలిస్ట్ లు సైతం పోల్చుకుంటున్నారు. ఒకవేళ నిజమైతే ఈరోజో రేపో ఆయన స్పందించక మానరు. చూద్దాం
   

Tags:    

Similar News