మూడు నెల‌లు క్రేజీ సినిమాల జాత‌రే

Update: 2022-06-02 16:30 GMT
సినిమాల‌కు ప్ర‌త్యేకంగా సీజ‌న్ లు అంటూ వుంటుంటాయి. స‌మ్మ‌ర్ సీజ‌న్ , సంక్రాంతి సీజ‌న్‌, ద‌స‌రా, దీపావ‌ళి సీజ‌న్ లు సినిమాల‌కు ప్ర‌త్యేకం. అయితే ఇందులో స‌మ్మ‌ర్ సీజ‌న్ ని వ‌సూళ్ల ప‌రంగా ప్ర‌త్యేకంగా చూస్తుంటారు. కార‌ణం స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ప్ర‌క‌టించ‌డంతో అంతా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంటారు. చాలా వ‌ర‌కు ఫ్యామిలీస్ వినోదం కోసం భారీ స్థాయిలో థియేట‌ర్ల‌కు వ‌స్తుంటారు. దీంతో వేస‌విని ప్ర‌తీ మూవీ మేక‌ర్ చాలా కీల‌కంగా భావిస్తుంటారు.

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ వేస‌వి సీజ‌న్ లో ప్ర‌త్యేకంగా పోటీప‌డుతూ వుంటుంది. భారీ సినిమాలు, చిన్న చిత్రాల‌తో పాటు మినిమ‌మ్ గ్యారెంటీ సినిమాలు కూడా వేసవి స‌మ‌రానికి సై అంటుంటాయి. ఇదిలా వుంటే ఈ ఏడాది అంటే 2022 వేసివి ఎండింగ్ కు వ‌చ్చేస్తోంది.

ఈ వేస‌విలో విడుద‌లైన సినిమాలు చాలా వ‌ర‌కు పాన్ ఇండియా సినిమాలు మిన‌హా మిగ‌తా చిత్రాలు పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయాయి. మిశ్ర‌మ ఫ‌లితాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌రువాతి బంచ్ రెడీ అయిపోయింది. మినిమ‌మ్ గ్యారెంటీ, మ‌ధ్య స్థాయి సినిమాలు పోటీకి దిగుతున్నాయి.  

ఈ శుక్ర‌వారం నుంచి మ‌రో మూడు నెల‌ల పాటు దాదాపు 25 మీడియం రేంజ్ సినిమాలు థియేట‌ర్లలో సంద‌డి చేయ‌బోతున్నాయి. అడివి శేష్‌, నాని, ఉస్తాద్ రామ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గోపీచంద్‌, స‌త్య‌దేవ్‌, రానా, వైష్ణ‌వ్ తేజ్‌, నాగ‌చైత‌న్య‌, క‌ల్యాణ్ రామ్ త‌దిత‌ర హీరోలు త‌మ సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వ‌ద్ద పోటిప‌డ‌బోతున్నారు. జూన్ , జూలై, ఆగ‌స్టు వ‌ర‌కు ప్ర‌తీ వారం ఏదో ఒక సినిమా థియేట‌ర్ల‌లో హ‌ల్ చ‌ల్ చేయ‌బోతోంది.

జూలైలో రామ్ పోతినేని, గోపీచంద్‌, నాగ‌చైత‌న్య‌, వైష్ణ‌వ్ తేజ్ , నిఖిల్ త‌మ సినిమాల‌తో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. గోపీచంద్'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ తో, నాగ‌చైత‌న్య థాంక్యూ తో , రామ్ ది వారియ‌ర్ తో , నిఖిల్ కార్తికేయ 2 తో , అడివి శేష్'హిట్ 2'తో జూలైలో సంద‌డి చేయ‌బోతున్నారు.

ఇక ఆగ‌స్టులో విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా మూవీ'లైగ‌ర్‌' తో రాబోతున్నాడు. దుల్క‌ర్ స‌ల్మాన్'సీత‌రామం', క‌ల్యాణ్ రాయ్'బింబిసార‌', నితిన్'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం చిత్రాల‌తో పోటీప‌డ‌బోతున్నారు.
Tags:    

Similar News