బాహుబలి2 రేట్లు పెరగట్లే!!

Update: 2017-04-22 06:44 GMT
బాహుబలి ది కంక్లూజన్.. ఈ సినిమా కోసం దేశం అంతా ఎదురుచూడ్డం సంగతేమో కానీ.. తొలివారంలో మాత్రం జనాల జేబులకు చిల్లులు పడ్డం ఖాయం అనేస్తున్నారంతా. బ్లాక్ టికెట్స్ తో సమానంగా అసలు టికెట్ రేట్స్ వసూలు చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఉంది. ఒక్కో టికెట్ ను 200 రూపాయలకు విక్రయించేందుకు అనుమతించాలని కోరినట్లు.. దీనికి ఏపీ సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందే టాక్ ఉంది.

అయితే.. నైజాం ఏరియాలో మాత్రం టికెట్ రేట్ల ఉండబోదని అంటున్నారు. హైద్రాబాద్ విషయం ఇంకా తేలలేదు కానీ.. జిల్లాల్లో మాత్రం సాధారణ రేట్లకే బాహుబలి టికెట్లను విక్రయించనున్నారట. ఈ విషయంలో మార్పులు ఉండవని ప్రభుత్వం నుంచి ఇప్పటికే సిగ్నల్స్ వచ్చినట్లు చెబుతున్నారు. హైద్రాబాద్ విషయంలో కూడా ఇదే నిర్ణయం ఉండొచ్చని.. తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలు గతం మాదిరిగానే ఉండొచ్చనే టాక్ కూడా ఉంది. ఇది ఒక రకంగా బాహుబలి మేకర్స్ కు షాక్ అని చెప్పాల్సిందే.

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందించి.. దాని వసూళ్లను రాబట్టేయడం కోసం విపరీతంగా రేట్లు పెంచేసుకోవాలనే ఆలోచనకు.. ఆడియన్స్ నుంచి కూడా వ్యతిరేకత వస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News