పెద్ద సినిమా విడుదలైన వెంటనే అధికారికంగానో, అనధికారికంగానో మొదట రెండు వారాలూ టిక్కెట్ రేట్లు పెంచేస్తున్నారు థియేటర్ యాజమాన్యం. అడిగితే టిక్కెట్ కి పాప్ కార్నో, కూల్ డ్రింకో ఫ్రీ అనే కారణాలు చెబుతున్నా సగటు మధ్యతరగతి కుటుంబానికిది అధిక ఖర్చే. అందుకే రెండు మూడు వారాలైన తరువాత తీరిగ్గా చుద్దామనుకునే వారి సంఖ్యా పెరిగిపోతుంది. కేవలం కలెక్షన్ల కోసమే ఈ ఎత్తులన్నీ చేస్తున్నా దానివలన వచ్చే ప్రయోజనం పెద్దగా లేకపోలేదు.
అయితే ఇప్పుడు ఈ టిక్కెట్ ధరల హెచ్చుని అనివార్యం చేసినట్టు తెలుస్తుంది. ఆంద్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల నుండీ టిక్కెట్ రేట్లు పెరగనున్నట్టు సమాచారం. ఈ ధర రెండు మూడు వారాలకే కాక మొత్తంగా పెంచడం గమనార్హం.
అయితే స్లాబ్ రేట్ లు ఎలా పెరగనున్నాయన్నదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ విధమైన పరిణామాలతో మధ్య తరగతి బడ్జెట్ కి తప్పకుండా చిల్లులు పడే అవకాశం వుంది. రానురానూ సినిమా కూడా లగ్జరీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.