స్టార్ హీరోల ఫ్యాన్స్ మ‌ధ్య‌ టిక్కెట్ వార్

Update: 2022-03-23 07:33 GMT
పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. విడుద‌ల‌కి ఇంకా గంట‌ల్లోనే గ‌డువుంది. దీంతో చ‌ర‌ణ్‌-తార‌క్ అభిమానుల్లో ఉత్సాహం అంత‌కంత‌కు పెరిగిపోతుంది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా? అన్న ఎగ్జైట్ మెంట్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది.  సాధార‌ణంగా స్టార్ హీరోల  డై హార్డ్ ఫ్యాన్స్ అంతా బెనిఫిట్ షోల‌తోనే త‌మ అభిమానాన్ని చాటుకుంటారు. స‌రిగ్గా తార‌క్-చ‌ర‌ణ్ అభిమానులు ఇప్పుడు అదే ఫేజ్ లో ఉన్నారు.

బెనిఫిట్ షో టిక్కెట్ కోసం చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఎంత ఖ‌రీదైన పెట్ట‌డానికి రెడీ గా ఉన్నారు. బెనిఫిట్ షో చూడాలి..కాల‌ర్ ఎగ‌రేయాలి అని ప‌ట్టుద‌లతో టిక్కెట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే టిక్కెట్ ధ‌ర 3000-5000 ధ‌ర వ‌ర‌కూ ప‌లుకుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

తాజాగా రిలీజ్ స‌మ‌యం మరింత ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో ఆ ధ‌ర ఇంకా హైక్ అవుతుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. టిక్కెట్ ఖాస్ట్ 10 వేలు ప‌లికినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. అభిమానం అంటే మాదే అని నిరూపించుకోవ‌డానికి తార‌క్-చ‌ర‌ణ్ అభ‌మానులు ఒక‌రిపై ఒక‌రు పోటీ కి సైతం దిగుతోన్న వైనం క‌నిపిస్తుంద‌ని టాక్.

చ‌ర‌ణ్‌-తార‌క్ అభిమానులు ఎంత ఖ‌ర్చు చేయ‌డానికైనా ఏ మాత్రం  ఆలోచించ‌డం లేద‌ని మార్కెట్ లో నినిపిస్తోంది. బెనిఫిట్ షోకి ఇంకా కొన్ని గంట‌ల స‌య‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో అభిమానులు  టిక్కెట్ కాస్ట్ విష‌యంలో ఏమాత్రం ఆలోచించ‌డం లేద‌ని తెలుస్తోంది. ఒక‌ప్పుడు పాత రోజుల్లో చిరంజీవి..బాల‌కృష్ణ సినిమాలు రిలీజ్ అవుతున్న‌ప్పుడు ఇదే రేంజ్ లో హ‌డావుడి క‌నిపించేది. ఆ త‌ర్వాత కాల‌క్రమేణా ఆ హ‌డావుడి ద‌క్కింది. మ‌ళ్లీ ఇంత కాలానికి 'ఆర్ ఆర్ ఆర్' బెనిఫిట్ షో పాత రోజుల్నిత‌ల‌పిస్తుంది అన్న టాక్ వినిపిస్తుంది.  

ఇక ఆర్'ఆర్ ఆర్ ఆర్'  టిక్కెట్ ధ‌ర‌లు హైద‌రాబాద్ సిటీ ఫ‌రిదిలో ఆకాశ‌న్నంటుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. టిక్కెట్ ధ‌ర భారీగా పెంచి విక్ర‌యిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒక్కో టిక్కెట్ 419 రూపాయల ధ‌ర‌గా నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

ఇక‌ సిటీలో 24వ తేదీ రాత్రి నుంచే  ప‌లు చోట్ల బెనిఫిట్ షోల‌ను ఏర్పాటు చేసారు. మూసాపేట్..ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ప‌లు థియేట‌ర్ల‌లో స్పెష‌ల్ షోలు ఏర్పాటు చేసారు.  దాదాపు ఏడు థియేట‌ర్లో బిసీ సెంట‌ర్లు టార్గెట్ గా అభిమానుల కోసం షోలు వేస్తున్నారు. ఒక్క రాత్రి షో ద్వారానే  3  కోట్ల వ‌ర‌కూ ఆదాయం వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News