ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన 'డీజే టిల్లు' సైలెంట్‌గా విడుదలై సెన్సేషనల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. అత్యంత తక్కువ బడ్జెట్ తో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 50 కోట్లని రాబట్టడంతో ఒక్కసారిగా సిద్దూ జొన్నలగడ్డ కు భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు దర్శకుడు విమల్ కృష్ణే అయినా క్రెడిట్ మొత్తం సిద్దూ జొన్నలగడ్డకే దక్కింది.
దీంతో సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి. 'డీజే టిల్లు' హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దీనికి ప్రస్తుతం సీక్వెల్ గా 'టిల్లు స్వ్కేర్'ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే సందర్భం నుంచే వరుస వివాదాలు చుట్టుముట్టడం మొదలైంది. ముందు ఈ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు విమల్ కృష్ణ తప్పుకున్నాడు. అదేంటంటే చేసిన సినిమానే మళ్లీ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. తన ప్లేస్ లో మల్లిక్ రామ్ వచ్చి చేరాడు.
కట్ చేస్తే హీరోయిన్ నేహా శెట్టి ఔట్.. ఆ ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ వచ్చేసింది. రెగ్యులర్ షూటింగ్ మొదలైంది అంటూ టీమ్ ఓ వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో పూజా హెగ్డే తో పాటు అనుపమ పరమేశ్వరన్ పై కూడా సిద్దూ జొన్నలగడ్డ పంచ్ వేశాడు.
ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ మూవీ నుంచి అనుపమ పరమేశ్వరన్ కూడా తప్పుకుందని తెలిసింది. తను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి కారణం సెట్ లో హీరో సిద్దూ జొన్నలగడ్డ వ్యవహరించిన తీరు అని, అది నచ్చకే అనుపమ ఈ మూవీ నుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
తన స్థానంలో నయా రాధికగా మడోన్నా సెబాస్టియన్ ని ఎంపిక చేసుకుంటున్నారట. అయితే ఈ వార్తలపై సిద్ధూ జొన్నలగడ్డ సోషల్ మీడియా వేదికగా స్పందిచాడు. టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్న ఓ స్టిల్ ని అభిమానులతో పంచుకున్న సిద్దూ ఫ్రెష్ అంట్ న్యూ రైడ్ ని మీకు అందిస్తానని ప్రామిస్ చేస్తున్నానన్నాడు. అంతే కాకుండా తనకు సపోర్ట్ చేస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపిన సిద్ధూ జొన్నలగడ్డ 'టిల్లు 2'ని 2023 మార్చి లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామన్నాడు.
ఇక రూమర్స్ పై త్వరలోనే ఓ స్పెషల్ ఇంటర్వ్యూతో సమాధానం చెబుతానన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. రూమర్స్ పై సిద్దూ ఎలా.. ఏమని క్లారిటీ ఇస్తాడో వేచి చూడాల్సిందే. అయితే హీరోయిన్ మరిదంట కదా అంటూ నెటిజన్ లు అడిగిన ప్రశ్నకు మాత్రం సిద్దూ రిప్లై ఇవ్వకపోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.