ఆ ఛానెల్ పేరు మార్చాలని వర్మ డిమాండ్

Update: 2016-11-02 08:11 GMT
నిన్నట్నుంచి ఇండియా అంతటా ఒకటే హాట్ టాపిక్. టైమ్స్ నౌ ఎడిటర్ ఇన్ చీఫ్ పదవికి అర్నాబ్ గోస్వామి రాజీనామా చేయడం పెద్ద సంచలనమే అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. టైమ్స్ నౌ ఇక ఏమైపోతుందో అనేవాళ్లు కొంతమంది. హమ్మయ్య ఇకపై అర్నాబ్ శబ్ద కాలుష్యం తప్పిందంటూ నిట్టూర్చే వాళ్లు కొంతమంది.. ఇంకా సోషల్ మీడియాలో జోకులకైతే కొదవే లేదు.

ఇలాంటి ఆసక్తికర పరిణామాలు ఏం జరిగినా ట్విట్టర్లో వెంటనే తనదైన శైలిలో కామెంట్లు చేసే రామ్ గోపాల్ వర్మ సైతం ఈ టాపిక్ మీద మాట్లాడేశాడు. అర్నాబ్ రాజీనామా నేపథ్యంలో అర్జెంటుగా ‘టైమ్స్ నౌ’ ఛానెల్ పేరు మార్చాలంటున్నాడు వర్మ. అర్నాబ్ లేడు కాబట్టి.. ఇకపై ఆ ఛానెల్ పేరును ‘టైమ్స్ దెన్’ అని మార్చాలన్నది వర్మ అభిప్రాయం. అంతే కాక అర్నాబ్ లేని టైమ్స్ నౌ.. తల లేని మొండెం లాంటిదని కూడా వర్మ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు ట్విట్టర్ జనాలు చాలామంది అర్నాబ్ పోకపై జోకులు పేల్చారు. ఇన్నాళ్లూ అర్నాబ్ అన్ అఫీషియల్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడని.. ఇకపై అధికారికంగానే ఆ పదవిలో నియమితుడయ్యే అవకాశముందని ఓ నెటిజన్ అంటే.. రతన్ టాటా ఆయన్ని టాటా గ్రూప్ ఛైర్మన్ పదవిలో నియమించబోతున్నాడని ఇంకొకరు అన్నారు. ఇకపై దేశంలో శబ్ద కాలుష్యం తగ్గుతుందని మరో నెటిజన్ చమత్కరించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News