సినీ పరిశ్రమ గురించి కొన్ని అభిప్రాయాలు బలంగా ఉంటాయి జనాల్లో. హీరోయిన్ కావాలంటే ఎవరినైనా శాటిస్ఫై చేయాల్సిందే అని.. ఈ విషయంలో అమ్మాయిలకు చాలా వేధింపులు ఉంటాయని వింటుంటాం. కానీ దీని గురించి ఓపెన్ గా మాట్లాడేవాళ్లు తక్కువ. అందులోనూ కాస్త పేరున్న వాళ్లెవరూ ఈ విషయం మాట్లాడరు. ఐతే బాలీవుడ్ నటి టిస్కా చోప్రా మాత్రం ఈ విషయంలో ఓపెన్ అయిపోయింది. హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలంటే.. తనతో గడపాలంటూ ఓ హీరో గతంలో తనకు ఆఫర్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించింది.
తాను కొత్తగా బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తన్న సమయంలో ఒక ప్రముఖ హీరో తనతో గడిపితేనే సినిమాల్లో అవకాశం ఇస్తానన్నాడని టిస్కా తెలిపింది. ఏకంగా మూడు నెలలు తనతో గదిలో గడిపితేనే ఛాన్స్ ఇస్తానని అతను చెప్పాడంది. ఆ హీరోతో పాటు ఓ ప్రముఖ దర్శకుడు కూడా తనను ఇలాగే అడిగాడని చెప్పింది టిస్కా. ఐతే తాను ఇలాంటి వాళ్లకు లొంగకుండా ప్రయత్నాలు కొనసాగించి.. సినిమాల్లో అవకాశాలు అందుకున్నట్లు టిస్కా చెప్పింది. ఇలా అంటూనే సినిమా రంగంలో స్థిరపడాలంటే ఇలాంటివి తప్పవని అమె చెప్పడం గమనార్హం. పడక సుఖం కోసం ఆత్రంగా చూసే చూసేవాళ్లు సినీ పరిశ్రమలో చాలామంది ఉంటారని.. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని ఆమె అంది. తారే జమీన్ పర్ సినిమాతో మంచి పేరు సంపాదించిన టిస్కా.. తెలుగులో రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.