మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `గ్యాంగ్ లీడర్` (1991 మే 9 రిలీజ్) సంచలనాల గురించి తెలిసిందే. ఈ సినిమా చిరు కెరీర్ పాథ్ బ్రేకింగ్ హిట్. ఆ తరవాత చాలా కాలంగా గ్యాంగ్ లీడర్ సినిమాని రీమేక్ చేస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తారని అభిమానులు వేచి చూశారు. దీనిపై మెగా ఫ్యాన్స్ లో చాలా ఆసక్తికర చర్చ సాగింది. మెగాస్టార్ సినిమాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి - గ్యాంగ్ లీడర్ - ఘరానా మొగుడు వంటి చిత్రాల్లో చరణ్ నటిస్తే బావుంటుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ ప్రతిసారీ చరణ్ ఆ క్లాసిక్స్ ని టచ్ చేయకూడదనే అభిప్రాయ పడ్డారు. తనకు వాటిలో నటించే ఆలోచన లేదని తెలిపారు. మొత్తానికి అలా మర్చిపోయిన ఆ సంగతిని మరోసారి గుర్తు చేయాల్సిన సన్నివేశం వచ్చింది ఇటీవల.
ఉన్నట్టుండి నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా విక్రమ్.కె.కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని ఇదివరకూ వార్తలొచ్చాయి. దాంతో నానీపైనా - దర్శకుడు విక్రమ్ పైనా మెగా ఫ్యాన్స్ ఫైరయ్యారు. ఆ టైటిల్ లో నటిస్తే చిరు లేదా చరణ్ నటించాలి. కుదరకపోతే మెగా హీరోల్లో ఎవరో ఒకరు మాత్రమే నటించాలి అంటూ మెగా ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో వీరంగం వేసారు. చిరు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సినిమా టైటిల్ తో చెర్రీ మాత్రమే చేయాలన్నది మెగాభిమానుల ఆశ.. ఆలోచన. అందుకే ఈ టైటిల్ వివాదం అనూహ్యం గా పాపులరైపోయింది. బోయ్ కాట్ నానీస్ గ్యాంగ్ లీడర్! అంటూ మెగా ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో హ్యాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి ప్రచారం చేయడంతో సన్నివేశం హీటెక్కిపోయింది.
అయితే ఆసక్తికరంగా ఈ టైటిల్ వివాదం ఇంకా పెద్ద సమస్యగా బయటపడింది. దీనికి సంబంధించి శింగులూరు మోహన్ కృష్ణ అనే నిర్మాత తాను ఫిలింఛాంబర్ లో టైటిల్ ని రిజిష్టర్ చేయించానని.. రూ. 3కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ లో ప్రారంభోత్సవం చేస్తున్నామని ప్రకటించడం వేడెక్కించింది. నాని `గ్యాంగ్ లీడర్` టైటిల్ మాదేనని అధికారికంగానే ప్రకటించడంతో.. నాని & టీమ్ ఫిలిం ఛాంబర్ రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరించారని అతడు ఆరోపించారు. చాంబర్ వాళ్లు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదని.. చిన్న సినిమాకు ఒకలా పెద్ద సినిమాకు ఒకలా వాళ్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేసారు. దాంతో నానీ యూనిట్ కి ఆ నిర్మాతకు మధ్య చర్చలు మొదలయ్యాయి. మెగా ఫ్యాన్స్ సమస్య అటుంచి అసలు సమస్యను పరిష్కరించే దిశగా నాని నిర్మాతలు మాటా మంతీ సాగించారట. అసలింతకీ ఈ టైటిల్ ఎవరిది? నానీ - మానిక్యం మూవీస్ దా.. లేక మోహన్ కృష్ణకు దక్కుతుందా.. లేక మెగా కాంపౌండ్ కే ఆ రైట్ ఉంటుందా? అన్నది తేలాల్సి ఉందిపుడు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ఈ శుక్రవారం ఉదయం నాని టీమ్ తెలుగు ఫిలింఛాంబర్ లో మీడియా సమక్షంలో భేటీ కానుంది. ప్రస్తుతానికి ఈ టైటిల్ ఎవరిది? అన్నది సస్పెన్స్. ఇంతకాలంగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ కానీ, గీతా ఆర్ట్స్ లో కానీ ఈ టైటిల్ రిజిస్టర్ చేయలేదన్న మాటా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాని సదరు నిర్మాత తో మాట్లాడి పరిష్కరించుకోవాల్సి ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. మాణిక్య ం మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 3 టైటిల్ `గ్యాంగ్ లీడర్` ని ప్రకటిస్తున్నాం అంటూ మీడియాకి సందేశం పంపారు. అయితే టైటిల్ అదేనా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రేపటి భేటీలో నానీనే స్వయంగా క్లారిటీనిస్తారేమో చూడాలి.