ఇటీవలే హీరోయిన్ సాయిపల్లవి కశ్మీర్ పండిట్ హత్యలపై..గో హత్యలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రెండు హత్యల్ని ముడిపెట్టి మాట్లాడటంతో ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా ఆమెపై ఆగ్రజ్వాలలు ఎగసిపడ్డాయి. ''నాకు వయలెన్స్ అనేది తప్పుగా అనిపిస్తుంది. పాకిస్థాన్‌లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రరిస్ట్‌లా అనిపిస్తారు. ఎందుకంటే మనం వారికి ప్రమాదం తలపెడతామని...మనకు వాళ్లు అలా అలాగే కనిపిస్తారు. నాకు వయలెన్స్ అనేది నచ్చదు.
ఏది తప్పు ఏది రైట్ అని చెప్పడం కష్టం. మా ఫ్యామిలీ లో లెఫ్ట్ రైట్ అని ఉండదు. న్యూట్రల్‌గా చూసే ఫ్యామిలీలో పెరిగాను. అందులో ఎవరు రైట్.. ఎవరు రాంగ్ అని చెప్పలేను. మనం మంచిగా ఉండి.. ఎవరిని హార్ట్ చేయకుండా ఉంటే చాలు"అంటూ కాస్త లోతుగానే మాట్లాడింది. ఆ వ్యాఖ్యలు వెనుక ఎంతో పెయిన్ సైతం కనిపించింది. అయితే ప్రధానంగా పండింట్లు..గో హత్యపై తల పెట్టడంతోనే పల్లవి అడ్డంగా బుక్కైంది. ఆమె పై నెటి జనులు కొందరు అగ్రహ జ్వాలలతో రగిలి పోయారు.
నటి నటిగా ఉండకుండా..అంతకు మించిన పాత్ర పోషిస్తుందంటూ సెటైర్లు సైతం వైరల్ అయ్యాయి. ఆమె నటించిన ' విరాట పర్వం' రిలీజ్ ని సైతం బ్యాన్ చేయాలని వ్యతిరేక పవనాలు వీచాయి. ఈ నేపథ్యంలో అసలు సాయి పల్లవి ఎవరు? ఆమె గతం ఏంటి? ఎలాంటి కుటుంబం నుంచి వచ్చింది? వంటి వివరాలు నెట్ వేదికగా సెర్చ్ చేయడం మొదలైంది.
ఈ అన్వేషణలో ఆసక్తికర విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. సాయి పల్లవి తమిళనాడుకి చెందిన బడగ జాతికి చెందిన అమ్మాయిగా తెలుస్తుంది. వీళ్లది తమిళనాడులోని నీలగిరి ప్రాంతం. ఈ తెగకి చాలా చరిత్రే ఉంది. టిప్పు సుల్తాన్ మతం మారని వారిని బలవంతంగా చంపుతున్న నేపథ్యంలో బడగా తెగ టిప్పుపై తిరగబడింది.
గొరిల్లా యుద్ద పద్దతిలో టిప్పు సైన్యాన్ని మట్టి కరిపించింది. బడగా దెబ్బకి టిప్పు సైన్యం ఇనుప చట్రాలతో శరీరమంతా సెక్యుర్ గా ఉండేలా చూసుకునేవారుట. ఈ తెగ అమ్మాయిలు నాట్యంలో బాగా ఆరితేరిన వారుట. సాయి పల్లవిలో తెగింపు గానీ..నాట్యం లో మెలకువలు గానీ పూర్వీకుల నుంచే ఉన్నాయని ఈ సందర్భంగా వెలుగులోకి వస్తుంది.
శరీరాన్ని అంత సులభంగా విల్లులా వంచడం అంటే ఎంతో కఠోర శిక్షణ ఉంటే తప్ప నేర్వలేరని తెలుస్తుంది. 1951 వరకూ వీళ్లకి ఎస్టీ హోదా ఉండేది. తర్వాత బీసీలుగా మారారు. వీరి అరణ్య వాసానికి కారణం టిప్పు సుల్తాన్. బాధింపు తెగలో తిరుగుబాటుకి ఆనాడే బీజం పడిందని... పల్లవి చేసిన వ్యాఖ్యల వెనుక ఇంత కథ ఉందని అంటున్నారు.
సాయి పల్లవి కుటుంబం ఊటీ నుంచి కోయంబత్తూరు వచ్చి సెటైలైందని తెలుస్తోంది. అందుకే ప్రతీ విషయంలో పల్లవి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని.. తన తెగకు చెందిన కట్టుబాట్లకు ఆచరణకు పెద్ద పీట వేస్తుందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.