ఒంట‌రి దీవుల విహారంలో హ‌నీ ఈజ్ ది బెస్

Update: 2022-07-15 12:01 GMT
ఒంట‌రి దీవుల్లో చిలిపిగా చెల‌రేగిపోతోంది మెహ్రీన్ ఫీర్జ‌దా. నెక్ట్స్ సినిమా సెట్స్ కి వెళ్లే ముందే త‌న సోద‌రుడితో క‌లిసి ఫ్లోరిడా దీవుల‌కు వెళ్లిన ఈ  బ్యూటీ ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది.  బులుగు జిలుగు స‌ముద్రంలో వాట‌ర్ స్పోర్ట్స్ ఆడుతూ బికినీల‌తో ధ‌డ పుట్టిస్తోంది.

ఇంత‌కీ ఫ్లోరిడా దీవుల్లో మెహ్రీన్ చేసే ప‌నుల జాబితా ఎలా ఉంది? అన్న‌ది చూస్తే చాలా సంగ‌తులే ఉన్నాయి. ఓవైపు బికినీ డ్యాన్స్ మ‌రోవైపు డైవింగ్.. ఇంకోవైపు యాచ్ జ‌ర్నీలు.. బీచ్ ఇసుక‌లో ప‌రుగులు ఇలా చెప్పుకుంటూ వెళితే అన్నీ ఇన్నీ కావు. అమెరికా పర్యటనలో పశ్చిమ తీరం మీదుగా ఫ్లోరిడా తీరాన్ని విహంగ‌వీక్ష‌ణం చేస్తున్న‌ప్పుడు త‌న‌తో పాటే సోదరుడు గుర్ఫతే ఉన్నారు.

త‌న‌తో కలిసి యాచ్ లో ఎంతో ఉత్సాహంగా షికార్ చేసారు. ఫ్లోరిడా- మయామిలో మెహ్రీన్ త‌న సోద‌రుడితో క‌లిసి విహరించారు. స్విమ్ సూట్ లో తన సోదరుడితో కలిసి యాచ్ లో డ్యాన్సింగ్ కూడా చేసింద‌ట‌. ఇద్దరూ అట్లాంటిక్ జలాల్లో ఈత పోటీకి దిగార‌ని కూడా తెలిసింది.

అలా బికినీ డైవ్ చేయ‌డం కానీ బీచ్ ఇసుక‌లో స‌న్ బాత్ చేయ‌డం కానీ.. యాచ్ లో డ్యాన్సులు చేయ‌డం కానీ ప్ర‌తిదీ త‌న లైఫ్ బెస్ట్ సెల‌బ్రేష‌న్ అని మురిసిపోతోంది.

ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మెహ్రీన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టించి ఇప్పుడు తీరిగ్గా ఉంది. ఇటీవ‌లే విడుద‌లైన‌ F3 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. త‌దుప‌రి ఏ సినిమాలో న‌టిస్తోందో వెల్ల‌డి కావాల్సి ఉంది.
Tags:    

Similar News