స్టార్స్ నుంచి టెక్నీషియన్స్ వరకూ సినిమా రంగానికి చెందిన ప్రముఖులందరినీ ఒకే వేదికలో చూసే అవకాశం అవార్డు ఫంక్షన్స్.. ఈవెంట్స్.. కల్పిస్తాయి. బాలీవుడ్ లో అయితే ప్రతీ ఫంక్షన్ కు దాదాపు అందరూ అటెండ్ అవడం చూస్తూ ఉంటాం. అవార్డ్ వచ్చినా రాకపోయినా.. ఆయా ఫంక్షన్లలో స్టార్లు కూడా సందడి చేసి., అభిమానులను అలరిస్తూ ఉంటారు.
ప్రతీ విషయాన్ని బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి అరువు తెచ్చుకునేందుకు తెగ ప్రయత్నించేసే టాలీవుడ్ జనాలు మాత్రం.. ఈ కల్చర్ విషయంలో మాత్రం ఎక్కడో ఉండిపోయారు. అవార్డు ఫంక్షన్లకు హాజరు కావడాన్ని.. అతి తేలిగ్గా తీసుకుంటున్నారు. వారికి ఈ తరహా ఈవెంట్స్ పై ఉన్న చిన్నచూపే ఇందుకు కారణం అని చెప్పచ్చు. వీలైనంతవరకూ ఏదో ఒక అవార్డ్ వస్తేనే.. నిర్వాహకులు ఫలానా అవార్డ్ ఇస్తేనే ఫంక్షన్ కి అటెండ్ అవుతామని చెప్పే జనాభా మన దగ్గర బోలెడంత మంది కనిపిస్తారు.
ఇదంతా ఒక ఎత్తైతే.. అవార్డులు వచ్చినా సరే ఫంక్షన్లకు హాజరు కాని వాళ్లు కూడా ఉండడం విచిత్రం. రీసెంట్ గా జరిగిన సినీ మా అవార్డులు.. సైమా అవార్డులు.. ఫిలింఫేర్ అవార్డు ఫంక్షన్లలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. వీరిని రప్పించేందుకు నిర్వాహకులు చేసిన ప్రయత్నాలకు కూడా ఫలించలేదు. టాలీవుడ్ ఖ్యాతి గురించి వీలైనంత ప్రచారం దక్కాలంటే ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ ఎంత అవసరమో బాలీవుడ్ ని చూస్తే అర్ధమవుతుంది. అయినా సరే.. కొంతమంది మాత్రం తమ ఇగోల కారణంగా ఈ ఫంక్షన్లకు దూరంగా ఉంటూ.. ఇండస్ట్రీని చిన్నబుచ్చుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.