'డైరెక్టర్' ని సినిమాకు 'కెప్టెన్ ఆఫ్ ది షిప్' అని అంటారు. హీరోహీరోయిన్లు ఇతర నటీనటులు టెక్నిషియన్స్ అందరూ ఆయనను అనుసరిస్తారు. అందుకే సినిమా ఫలితం ఏదైనా కూడా అది దర్శకుడి నే బాధ్యున్ని చేస్తుంటారు. అయితే చాలా మంది హీరోలు కూడా కెప్టెన్ గా మారి సినిమా అనే ఓడను లీడ్ చేసే ప్రయత్నం చేశారు. అటు హీరోగా ఉంటూనే దర్శకుడిగా సత్తా చాటిన వారు ఉన్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి ఓ లుక్కేద్దాం..!
నందమూరి తారకరామారావు హీరోగా మంచి ఫార్మ్ లో ఉన్నప్పుడే మెగాఫోన్ పట్టుకున్నారు. తన స్వీయ నిర్మాణంలో 'సీతారామ కళ్యాణం' అనే మూవీతో దర్శకడి అవతరమెత్తారు ఎన్టీఆర్. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. అటు హీరోగానే కాకుండా ఇటు దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యారు.
సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే దర్శకుడుగా మెగాఫోన్ పట్టుకున్నాడు. 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్ గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. 'శంఖారావం' 'కలియుగ కర్ణుడు' 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు' 'పండండి సంసారం' వంటి సినిమాలు నట శేఖరుడు దర్శకత్వం వహించిన సినిమాల జాబితాలో ఉన్నాయి.
విలక్షణ నటుడు ఆర్.నారాయణ మూర్తి ఓ వైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు నిర్మాతగా దర్శకుడిగా నిరూపించుకున్నారు. 'అర్ధరాత్రి స్వతంత్య్రం' అనే సినిమాతో తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్న నారాయణ మూర్తి.. ఆ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో అనేక సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఈ క్రమంలో అవార్డులు కూడా అందుకున్నారు.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ తండ్రి బాటలో మెగాఫోన్ పట్టుకున్నారు. 'నర్తనశాల' అనే సినిమాకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన బాలయ్య.. హీరోయిన్ సౌందర్య అకాల మరణంతో సినిమా నిలిపివేశారు. అయితే ఆయన డైరెక్ట్ చేసిన కొన్ని సన్నివేశాలను గతేడాది దసరాకు NBK నర్తనశాల పేరుతో ఏటీటీలో విడుదల చేస్తే మంచి స్పందన తెచ్చుకుంది. ఈ విధంగా బాలకృష్ణ కూడా దర్శకుడిగా మారిన హీరో అనిపించుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా డైరెక్షన్ వైపు అడుగులు వేశారు. తన హోమ్ బ్యానర్ లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిరాశ పరచడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. అయితే 'గుడుంబా శంకర్' చిత్రానికి స్క్రీన్ ప్లే.. 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. ఈ జనరేషన్ హీరోల్లో ముందుగా డైరెక్టర్ అవతారమెత్తిన హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.
సీనియర్ హీరో జెడీ చక్రవర్తి కూడా డైరెక్షన్ చేయాలనే కోరిక నెరవేర్చుకున్నారు. యాక్టర్ గా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న జీడీ.. 'దుర్గ' అనే హిందీ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలుగులో 'హోమం' 'సిద్దం' 'మనీ మనీ మోర్ మనీ' 'ఆల్ ది బెస్ట్' వంటి సినిమాలతో పాటు పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు జీడీ చక్రవర్తి.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి 'నీతో' అనే సినిమాతో హీరోగా పరిచమయ్యాడు. ఆ తర్వాత ‘బొమ్మలాట’ సినిమాతో దర్శకుడిగా మారి.. ‘అనగనగా ఓ ధీరుడు’ ‘సైజ్ జీరో’ ‘జడ్జిమెంటల్ హై క్యా’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. టాలెంటెడ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నప్పుడే దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్నారు. 'ఊహలు గుసగుసలాడే' 'జ్యో అచ్యుతానంద' వంటి సినిమాలను అవసరాల డైరెక్ట్ చేశాడు.
మల్టీటాలెంటెడ్ యువ హీరో అడివి శేష్ 'కర్మ' అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్ గా సక్సెస్ సాధించకపోయినా.. అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నారు. 'అందాల రాక్షసి' 'టైగర్' 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు.
'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ కూడా హీరోగా నటిస్తూనే డైరెక్టర్ గా మారాడు. 'ఫలక్ నుమా దాస్' అనే సినిమాతో మెగాఫోన్ పట్టుకొన్న విశ్వక్.. దీనికి సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా చాలా మంది హీరోలుగా నటిస్తూనే డైరెక్టర్ గా మారారు. వీళ్లే కాకుండా చిత్తూరు నాగయ్య - ఎస్వీ రంగారావు - సీనియర్ హీరో బాలయ్య - గిరిబాబు - ప్రకాష్ రాజ్ వంటి నటులు కూడా దర్శకులుగా మారి సినిమాలు తెరకెక్కించారు.