ఫోటోలు నావి కాదు.. మార్ఫింగ్ చేశారు

Update: 2017-02-26 10:19 GMT
ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అందరూ భారీ అందాల బ్యూటి అయేషా టికియా ఏంటి అలా అయిపోయింది అంటూ నానా హంగామా చేస్తున్నారు. ఆ పెదాలను చూస్తుంటే పెద్ద పెద్ద గండు చీమలు కుట్టినట్లు ఉన్నాయి కాబ్టటి.. అమ్మడు ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించిందనే అంటున్నారు. గతంలో కూడా సడన్ గా అమ్మడి వక్షోజాల సైజు పెరిగిపోవడంతో.. అప్పుడు కూడా సర్జరీ చేయించుకుని సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టించుకుందని అన్నారు. అయితే ఈ లిప్ సర్జరీ రచ్చపై అమ్మడు ఏమంటోందో తెలుసా??

''అబ్బే అవన్నీ వట్టి రూమర్లే. పనికట్టుకుని నా ఫోటోలను అలా మార్ఫింగ్ చేయించి.. నేనేదో లిప్ సర్జరీ చేయించుకున్నారని రాస్తున్నారు. అదంతా నిజం కాదు. నేను న్యాచరుల్ గానే ఉన్నాను. నా పెదాలకు ఎలాంటి సర్జరీ చేయించలేదు. దయచేసి మార్ఫింగ్ ఫోటోలను సర్కులేట్ చేసే పైశాచిక ఆనందం తగ్గించుకోండి'' అంటూ ప్రముఖ న్యూస్ పేపర్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఒక స్టేట్మెంట్ పంపింది అమ్మడు.

''సూపర్'' సినిమాతో తెలుగువారికి పరిచయమైన ఈ హాటీ.. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రావడం కోసం చాలా స్లిమ్మయ్యింది. కాకపోతే గండు చీమ కుట్టినట్లు ఉన్న ఆ పెదాలను చూస్తుంటే మాత్రం.. అవి న్యాచురల్ అనుకునే అవకాశమే లేదు. లిప్స్ డోంట్ లయ్ అనాల్సిందే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News