మన స్టార్ హీరోల మొండిపట్టు.. ప్రభాస్ కూడా..

Update: 2022-11-25 02:30 GMT
మన స్టార్ హీరోలు చాలామంది మొండిపట్టుదలతో స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా అది మంచి జరగవచ్చు లేదా ఇంకా ఏదైనా జరగవచ్చు కానీ ప్రాజెక్టు చేస్తున్నంతసేపు కూడా నమ్మకంగా అనిపించాలి అనే విధంగానే ఆలోచిస్తున్నారు. ఆ విషయంలో దర్శకుల మనోభావాలు గురించి కూడా వాళ్ళు ఏమాత్రం లెక్క చేయడం లేదు.

ఇటీవల కాలంలో అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అగ్ర హీరోలు అనుకున్న ప్రాజెక్టులను క్యాన్సిల్ చేసుకోవడం ఆచార్యాన్ని కలిగిస్తోంది. ముందుగా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలు కావాల్సింది. భవదియుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ వివిధ కారణాల వలన ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. దర్శకుడు ఇప్పుడు మరో కథ సెట్ చేసుకునే పనిలో పడ్డాడు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయింది అని అనుకున్న సమయంలో ఎన్టీఆర్ కథ విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తిగా లేకపోవడంతో ఆ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్ కూడా ఫినిష్ చేసుకోగా మహేష్ బాబు మళ్ళీ తర్వాత ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇప్పుడు మళ్లీ మహేష్ త్రివిక్రమ్ ఇద్దరూ కొత్త తరహా కథతో రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రాంచరణ్ తో సినిమా చేయాలని సంతకం కూడా చేశాడు. అయితే అయితే ఆ కథ విషయంలో కూడా పూర్తిస్థాయిలో నమ్మకంగా అనిపించకపోవడంతో రాంచరణ్ మళ్ళీ క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్టును కూడా అంత తొందరగా మొదలుపెట్టడానికి ఇష్టపడలేదు. కొరటాల ఇంతకుముందు ఆచార్యతో దెబ్బ తినడం వలన మళ్లీ తదుపరి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో కనెక్ట్ అయ్యేవరకు కూడా ఎన్టీఆర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఒప్పుకోలేదు.

ఇక ఈ స్టార్ హీరోలు అందరిలోనూ కేవలం ప్రభాస్ మాత్రమే షూటింగ్స్ స్క్రిప్ట్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేకుండా ముందుకు వెళుతున్నట్లుగా అనిపించింది. కానీ ప్రభాస్ కూడా ఇటీవల ఆదిపురుష్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత గ్రాఫిక్స్ విషయంలో మళ్ళీ మార్పులు చేయాలని ఆ సినిమాను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News