`మేజర్` తరువాత టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక్కటంటే ఒక్కటి నిలబడలేకపోయింది. జూలైలో థియేటర్లలోకి వచ్చిన ప్రతీ సినిమా డక్కౌట్ అయి పెవిలియన్ దారి పట్టిన బ్యట్స్ మెన్ ల తరహాలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులని సొంతం చేసుకున్నాయి. దీంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లింది. ఇక తెలుగు సినిమాల పరిస్థితి ఇంతేనా అనే స్థాయికి వెళ్లిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే జూలై టాలీవుడ్ కు ఓ పీడకలలా నిలిచి షాకిచ్చింది.
జూలైలో విడుదలైన ప్రతీ సినిమా పెట్టిన పెట్టుబడిలో పావుల వంతు ని కూడా తిరిగి రాబట్టలేక దారుణంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచి షాకిచ్చాయి. గోపీచంద్ - మారుతిల పక్కా కమర్షియల్, లావణ్య త్రిపాఠీ - మైత్రీల హ్యపీ బర్త్ డే, నాగచైతన్య - దిల్ రాజుల థాంక్యూ, రామ్ - లింగు స్వామిల`ది వారియర్, సాయి పల్లవి గార్గీ, మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ ఎంటర్ టైనర్ `రామారావు ఆన్ డ్యూటీ` వరుసగా బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేశాయి.
ఈ సినిమా కారణంగా నిర్మాతలు భారీ స్థాయిలో నష్టాలని చవి చూశారు. కనీస పెట్టుబడిని కూడా ఈ సినిమాలు రాబట్టలేకపోవడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదిలా వుంటే టాలీవుడ్ భయాలని పోగొట్టి ఆగస్టు 5న విడుదలైన `బింబిసార`, `సీతారామం` వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ లు అనిపించుకున్నాయి. థియేటర్లకు ప్రేక్షకులు రారని భయాందోళనకు గురవుతున్న నిర్మాతలకు కొండంత బలాన్నిచ్చాయి.
ఇక ఆగస్టు 13న విడుదలైన `కార్తికేయ2` కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా హిందీ బెల్ట్ లో డబ్బింగ్ వెర్షన్ మంచి క్రేజ్ ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ వసూళ్ల దిశగా పయనిస్తుండటంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ఈ మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు గా నిలవడంతో డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం, ఆగస్టు 13న విడుదలైన `కార్తికేయ 2` టాలీవుడ్ కళ్లు తెరిపించాయి. కంటెంట్ వుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువు చేశాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కంటెంట్ ప్రధాన సినిమాల విషయంలో కళ్లు తెరిచినట్టేనా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. తాజా హిట్ లని దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి కంటెంట్ పై దృష్టి పెట్టాలని పలు వురు కామెంట్ లు చేస్తున్నారు.