మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ కారణంగా సినిమా ఇండస్ట్రీకి జరిగిన నష్టం అంతాఇంతా కాదు. ప్రేక్షకుల్లో సైతం విపరీతమైన భయాందోళనలు వ్యక్తం కావటంతో థియేటర్లు ఓపెన్ అయ్యాక.. సినిమా చూసేందుకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మొదటి వేవ్ తర్వాత ప్రదర్శించిన సాహసం.. తెగువ సెకండ్ వేవ్ తర్వాత మాత్రం కాస్త ఆలస్యమైందనే చెప్పాలి. ఆ మాటకు వస్తే.. మొదటి వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చన్న మాటకు స్పందించిన థియేటర్ యజమానులు.. సెకండ్ వేవ్ తర్వాత మాత్రం అంత ఉత్సాహాన్ని చూపించకపోవటం తెలిసిందే.
అదే సమయంలో.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ విధానాలు తోడయ్యాయి. ఒకవైపు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో? అన్న సందేహం.. మరోవైపు బడా హీరోలు ఎవరూ కూడా తమ సినిమాలను విడుదల చేయటానికి సాహసించలేదు. ఇలా కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉండాలో.. సెకండ్ వేవ్ తర్వాత సినిమా ఇండస్ట్రీ వేగంగా రికవరీ కాకపోవటానికి అన్నేసి కారణాలు ఉన్నాయని చెప్పాలి.
సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన నెలన్నరకు కానీ థియేటర్లు ఓపెన్ చేసేందుకు ముందుకు వచ్చారు. దీనికి కారణం.. ఏపీ ప్రభుత్వం థియేటర్ల ఓపెన్ కు సంబంధించిన అనుమతులు ఇవ్వకపోవటమే . ఇంతేకాదు.. సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన సినిమాల్ని చూసినప్పుడు అన్ని.. డైరెక్టర్స్ సినిమాలే తప్పించి.. స్టార్ కథనాయకుల సినిమాలు లేకపోవటం కూడా కారణం. తెలుగులో విడుదలైన సినిమాల్ని చూస్తే.. ఏ సినిమా అయినా.. దర్శకుడే ఎక్కువగా ఫోకస్ అయ్యారే తప్పించి.. హీరోలు ఎలివేట్ కాలేదన్నది వాస్తవం.
ఎక్కడిదాకానో ఎందుకు విపరీతమైన బజ్ మధ్య విడుదలైన ‘లవ్ స్టోరీ’ మూవీ విషయానికి వస్తే.. నాగ చైతన్య కంటే కూడా.. ఆ చిత్రానికి దర్శకుడైన శేఖర్ కమ్ముల మూవీగా ప్రచారం జరగటం.. ఓపెనింగ్స్ కూడా ఆ కోణంలోనే జరిగాయని చెప్పక తప్పదు. దసరాకు వస్తున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మూవీ సైతం దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బొమ్మ మీద నమ్మకమే సినిమా మీద ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇలా.. సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన అన్ని సినిమాలు దర్శకుడి పేరు మీదనే నడిచాయే తప్పించి.. బడా హీరోల్ని చూసి ప్రేక్షకులు థియేటర్లకు రాలేదన్నది వాస్తవం. మరీ.. ఈ పరిస్థితి మారటానికి మరికొన్నాళ్లు పట్టటం ఖాయమని చెప్పక తప్పదు.