మామ కామెంట్ అల్లుడిపై ఇంపాక్ట్?

Update: 2020-01-13 08:29 GMT
ఏపీలో మూడు రాజ‌ధానుల అంశం పై అన్ని జిల్లాల ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు. అభివృద్ది వికేంద్రీక‌ర‌ణ చాలా గొప్ప ఆలోచ‌న అని..ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవాలంటే గ‌ట్స్ ఉండాల‌ని జ‌గ‌న్ ని ఉద్దేశించి ప్ర‌శంసించారు. మెగాస్టార్ అభిప్రాయాన్ని ప‌రిశ్ర‌మ‌ లో చాలా మంది స్వాగతించారు. ప‌రిశ్ర‌మ నుంచి వైకాపా కి మ‌ద్ద‌తిచ్చే వారు అంత‌కంత‌కు పెరిగారు. లోక క‌ల్యాణం కోసం తీసుకునే ఏ నిర్ణ‌యాని కైనా టాలీవుడ్ బాస‌ట‌గా నిలుస్తుంద‌ని ప్రూవ్ అవుతోంది. ఇప్పుడు తెలుగు సినీప‌రిశ్ర‌మ యావ‌త్తూ జ‌గ‌న్ నిర్ణ‌యానికే జై కోడుతున్నారు.

ఈ నేప‌థ్యం లో ఉన్న‌ట్టుండి మెగానిర్మాత అశ్వ‌నిద‌త్ ఎందుక‌నో త‌న స్నేహాన్ని సైతం మ‌రిచి చిరు వ్యాఖ్య‌ల‌పై మండి ప‌డ్డారు. అమ‌రావ‌తే ముద్దు... మూడు రాజ‌ధానులు వ‌ద్దు!! అంటూ త‌న స్వ‌రం వినిపించే ప్ర‌య‌త్నం చేసారు. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి మ‌ద్ద‌తిస్తూ...చిరంజీవి వ్యాఖ్య‌ల‌ను ప‌బ్లిగ్గానే ఖండిచారు. బ‌హుశా ప‌చ్చ పార్టీ ఆదేశానుసారం ఇలా జ‌రిగింది. అయితే ద‌త్ రాజ‌కీయ నాయ‌కుడు కాదు.. ఏ పార్టీతోనూ సంబంధం లేదు.  ఓ కామ‌న్ మ్యాన్ గా మాత్ర‌మే త‌న నిర్ణ‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేసారా అంటే సందేహ‌మే. ఓ సామాజిక వ‌ర్గానికి కొమ్ము కాసే ప్ర‌య‌త్న‌మే ఇద‌న్న విమ‌ర్శ‌లు అప్పుడే ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం దీనిపై ఫిలిం స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ ర‌న్ అవుతోంది. అలాగే ద‌త్ నోరు జార‌డం ఆయ‌న‌ అల్లుడు నాగ్‌ అశ్విన్ కెరీర్ పైనా ప్ర‌భావం చూపుతుందా అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ద‌త్ వ్యాఖ్య‌ల నేప‌థ్యం లో నాగ్ అశ్విన్ కు మెగా కాంపౌండ్ లో ఎంట్రీ ఈజీ కాద‌నే ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

మ‌హాన‌టి త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాల‌ని నాగ్ అశ్విన్ స‌న్నాహాల్లో ఉన్నాడు. మెగాస్టార్ సైతం మ‌హానటి త‌ర్వాత ఆ యంగ్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయాల‌ని.. మంచి సోషియా  ఫాంట‌సీ క‌థ సిద్ధం చేయ‌మ‌ని సూచించాడు. నాగ్ అశ్విన్ ఆ ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగింది. కానీ మామ తాజా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అల్లుడిపై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం లేక‌ పోలేద‌ని అంటున్నారు. మిగ‌తా మెగా కాంపౌండ్ హీరోల వ‌ర‌కూ ఈ యంగ్ డైరెక్ట‌ర్ కి ఛాయిస్ ఉంటుందా.. అంత దాకా ఎలా వెల్ల‌గ‌ల‌డు? అంటూ సందేహాలు వ్య‌క్తం అవుతోంది. మూడు రాజ‌ధానుల‌కు సపోర్టు నివ్వ‌క‌పోయినా వ్య‌తిరేకించ‌క‌పోతే బావుండేది అన్న వ్యాఖ్య‌లు  ఓ సెక్ష‌న్ లో వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు సాన్నిహిత్యాన్ని చాటుకోవ‌డం ఓకింత ఇబ్బందిక‌ర‌మేన‌న్న మాటా వినిపిస్తోంది.
Tags:    

Similar News