నేచురల్ స్టార్ నాని - శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ''జెర్సీ''. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ డ్రామాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితారా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది సమ్మర్ లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి కూడా ఎంపికైంది. ఈ కంటెంట్ మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ అమన్ గిల్ తో పాటు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్ - దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములు అయ్యారు.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో 'జెర్సీ' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో కూడా మాతృకను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి కే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇందులో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా.. కోచ్ పాత్రలో షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి కరోనా బ్రేక్స్ వేసింది. వచ్చే ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హిందీ రీమేక్ కి జీఏ2 ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాణ పర్యవేక్షణ చూసుకోబోతున్నారట. ఈ చిత్రంతో హిందీలో కూడా పాగా వేయాలని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.