మాస్ సినిమాలకు మరిగితే.. ఇక అంతే..!

Update: 2023-01-21 05:30 GMT
తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్తుందని ఓపక్క ఆనంద పడుతున్నారు తెలుగు ప్రజలు. మరోపక్క ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా అలాగే గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా హిట్లుగా నిలిచిన సినిమాలు చూస్తుంటే మన తెలుగు సినిమా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని అనిపించుకోక తప్పదు. అసలు విషయం ఏమిటంటే క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ధమాకా సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలైన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు పూర్తిగా మాస్ మసాలా మూవీస్.

అదేవిధంగా ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ కూడా దక్కించుకున్నాయి. సినిమాలకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడతారు అన్న విషయం ముందు నుంచి అందరికీ తెలిసిందే. అయితే అది మరోసారి రుజువు అవ్వడంతో ఈ వ్యవహారం ఎప్పటికైనా రిస్కీ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే స్టార్ హీరోలు ఒకటి కాకపోతే మరొకటైన వర్కౌట్ అవుతుందని ఇలా కమర్షియల్ గా మాస్ మసాలా సినిమాలు చేసుకుంటూ పోతారని ఇక కొత్త కంటెంట్ అనే ఊసే లేకుండా పోతుందేమో అని అంచనాలు వెలబడుతున్నాయి.

 ఎందుకంటే హీరోలు రిస్క్ చేసి సినిమాలు చేసిన వాటిని ప్రేక్షకులే ఫైనల్ గా ఒప్పుకోవాలి. లేదంటే హీరో రీస్క్ మాత్రం ఎందుకు చేస్తారు. మహేష్ బాబు వంటి హీరోలు ప్రయోగాలు చేయడానికి గతంలో ఆసక్తి చూపించారు కానీ... ఆ ప్రయోగాలన్నీ విఫలమైన తర్వాత ప్రేక్షకులు అలాంటి ప్రయోగాలని ఎందుకో మెచ్చుకోవడం లేదని భావించి మళ్లీ ఆ ప్రయోగాల జోలికి వెళ్లలేదు. పూర్తిస్థాయి మాస్ మసాలా సినిమాలు చేసుకుంటూ తమ సినీ జీవితాన్ని గడిపేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ మాస్ మసాలా సినిమాలు కొంతవరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి.

 కానీ పూర్తిస్థాయిలో మాత్రం తెలుగు సినీ పరిశ్రమకు నష్టం చేయకలుస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కన్నడ సహా మలయాళం నుంచి మంచి ఆసక్తికరమైన విభిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటే మనవాళ్లు మాత్రం ఎంతసేపటికి మాస్ మసాలా మూవీలు, హింస, రక్త పాతం ఎక్కువగా ఉన్న సినిమాలు చేస్తుంటే ఇక కొత్త కంటెంట్ రావడం కష్టమే అనే మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News