స్టార్ ప్రొడ్యూస‌ర్ అందుకే స్పీడు త‌గ్గించారా?

Update: 2022-09-14 07:31 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ ప్రొడ్యూస‌ర్ ని చూసినా.. స్టార్ హీరోల‌ని చూసినా బ్యాక్ టు బ్యాక్ భారీ లైన‌ప్ క‌నిపిస్తోంది. క‌రోనా కార‌ణంగా దాదాపు మూడేళ్లు గ్యాప్ రావ‌డంతో ప్ర‌తీ స్టార్‌ హీరో చేతినిండా వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నాడు. ప్రొడ్యూస‌ర్స్ కూడా ఇదే త‌ర‌హాలో వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని నిర్మిస్తున్న క్ష‌ణం తీరిక లేకుండా బిజీ బిజీగా క‌నిపిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కూడా ఇదే త‌ర‌హాలో వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని నిర్మిస్తున్నారు.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ ల కాంబినేష‌న్ లో దిల్ రాజు ఓ భారీ పాన్ ఇండియా స్థాయి మూవీని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. దీనితో పాటు త‌మిళ స్టార్ హీరో విజ‌య్ తో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్న 'వారిసు' ని నిర్మిస్తున్నారు. ఇదే మూవీని తెలుగులో 'వార‌సుడు' పేరుతో రిలీజ్ చేయ‌బోతున్నారు. భారీ స్థాయిలో తెర‌కెక్కుతున్నఈమూవీ కూడా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే వుంది.

ఇక త‌న సోద‌రుడు శిరీష్ త‌న‌యుడు ఆషీష్ రెడ్డితో 'సెల్ఫీష్‌' మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కూడా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లోనే వుంది. ఇక గుణ‌శేఖ‌ర్ 'శాకుంత‌లం'కు వ‌న్ ఆఫ్ ది స‌పోర్ట‌ర్ గా నిలిచారు.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని దిల్ రాజునే రిలీజ్ చేయ‌బోతున్నారు. చుట్టూ ఇన్ని ప్రాజెక్ట్ లు వున్నా నిత్యం కొత్త క‌థ‌లు వింటూ స్టార్ కాంబినేష‌న్ ల‌ని సెట్ చేసే దిల్ రాజు ఈ మ‌ధ్య కొత్త‌గా క‌థ‌లు వినడం మానేశార‌ట‌.

కార‌ణం ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం వున్న ప‌రిస్థితులే అని తెలుస్తోంది. ఈ మ‌ధ్య కంటెంట్ వున్న సినిమాలు మాత్ర‌మే బాక్సాఫీస్ వ‌ద్ద రాణిస్తుండ‌టంతో ఫైనాన్షియ‌ర్స్ అలాంటి సినిమాల‌కే ఫైనాన్స్ చేయ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో దూకుడుగా వెళ్ల‌డం కంటే ఆచితూచి అడుగులు వేయ‌డ‌మే మంచిద‌ని దిల్ రాజు భావిస్తున్నాడ‌ట‌. ఆ కార‌ణంగానే సినిమాల విష‌యంలో దూకుడు త‌గ్గించుకున్న‌ట్టుగా తెలుస్తోంది.

త‌ను నిర్మించిన రెండు భారీ సినిమాలు సంక్రాంతి బ‌రిలో దిగ‌డానికి రెడీ అవుతున్న నేప‌థ్యంలో దిల్ రాజు దృష్టి కంప్లీట్ గా వీటిపైనే పెట్టార‌ట‌. ఏ ఇత‌ర ప్రాజెక్ట్ లు కానీ ఇత‌ర స్క్రిప్ట్ లు విన‌డానికి ఏమంత సుముఖంగా లేర‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇటీవ‌ల విజ‌య్‌ దేవ‌ర‌కొండ - ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ప్రాజెక్ట్ ని దిల్ రాజు నిర్మిస్తారంటూ వార్త‌లు వినిపించాయి. అయితే దీనిపై కూడా దిల్ రాజు ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News