పారితోషికం తగ్గించే ప్రసక్తే లేదంటున్న టాలీవుడ్ స్టార్స్..!

Update: 2020-11-05 02:30 GMT
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాలను చవి చూస్తోంది. ప్రొడ్యూసర్స్ -ఎగ్జిబిటర్లు - డిస్ట్రిబ్యూటర్స్ ఈ నష్టాల నుంచి బయటపడి మామూలు స్థితికి రావడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా క్రైసిస్ కష్టాల నుంచి ప్రొడ్యూసర్స్ ని గట్టెక్కించడానికి నటీనటులు - సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్ విషయంలో యాక్టివ్‌ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్స్ మరియు టెక్నీషియన్స్ పారితోషకాల్లో 20 శాతం కోత విధిస్తున్నట్లు గిల్డ్ ప్రకటించింది. రోజుకు రూ. 20 వేలకు పైగా వేతనం తీసుకునే నటీనటులకు.. అలాగే 5 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే టెక్నీషియన్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని గిల్డ్ పేర్కొంది. అయితే ఇండస్ట్రీలోని కొందరు స్టార్ హీరోలు డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ కోతలు విధించడానికి సహకరించడం లేదని తెలుస్తోంది.

టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు మరియు డైరెక్టర్లు ఈ ప్ర‌పోజ‌ల్ కి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. రెమ్యూనరేషన్ తగ్గించుకోకపోగా చాలామంది హీరోలు ఇంకొంచెం రేట్ పెంచుతున్నారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజ్ హీరో హీరోయిన్లందరూ పారితోషకం పెంచే కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్నారట. ఇప్పటికే పలువురు ప్రొడ్యూసర్స్ పెంచిన రెమ్యూనరేషన్ తోనే రాబోయే ప్రాజెక్టుల కోసం అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. మరికొందరు ముందు అగ్రిమెంట్ చేసుకున్నంత ఇస్తేనే షూటింగ్స్ కి వస్తామని నిర్మాత‌లకు తేల్చిచెప్తున్నారట. హీరో హీరోయిన్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా పారితోషకం తగ్గింపు నిర్ణయం ఇంప్లిమెంట్ అవడం లేదని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్స్ తో ఈ విషయంపై చర్చించడానికి ఎవరూ ముందుకురావడం లేదట. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన నిర్మాతలను కాపాడుకోవాల్సిన బాధ్యత వీరందరిపై ఉందనే విషయం ఈ స్టార్స్ ఎందుకు ఆలోచించడం లేదో మరి.
Tags:    

Similar News