టికెట్ కౌంటర్: ప్రేమమ్ దే పండగంతా

Update: 2016-10-10 17:30 GMT
ఈ వారం ఐదు సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. అందులో ఒకటి డబ్బింగ్ కాగా.. రెండు రీమేక్.. ఒకటి మల్టీ లింగ్యువల్.. ఇంకోడి డైరెక్ట్ సినిమా. అయితే.. అన్నింటిలోకి కూడా ముందు నుంచి అంచనాలున్న ప్రేమమ్ మూవీనే సత్తా చాటేసింది. డబ్బింగ్ సినిమా ఒకటి కూడా టాప్ 5 లిస్ట్ ఉండడం  ఈ వారం టికెట్ కౌంటర్ స్పెషాలిటీ.

1. ప్రేమమ్: మలయాళ ప్రేమమ్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ నాగ చైతన్య మూవీకి.. టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. రిలీజ్ రోజుకు సమానంగా రెండో రోజు.. ఆదివారం నాడు అంతకంటే ఎక్కువగా వసూళ్లు దక్కాయంటే.. టికెట్ కౌంటర్ల దగ్గర ప్రేమమ్ ఏ రేంజ్ లో సత్తా చాటుతోందో అర్ధమవుతుంది.

2. ఈడు గోల్డ్ ఎహె: టాక్ సంగతి ఎలా ఉన్నా.. సునీల్ నటించిన ఈడు గోల్డ్ ఎహె చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. మాస్ జనాల్లో ఫుల్లు ఫాలోయింగ్ ఉన్న సునీల్ తనకు తగ్గ స్థాయిలోనే ఓపెనింగ్ వసూళ్లను రాబట్టాడు. అయితే.. సినిమాకి ఇప్పటికే బ్యాడ్ టాక్ బాగా స్ప్రెడ్ అవడం.. వసూళ్లను బాగా ఎఫెక్ట్ చేస్తోంది.

3. అభినేత్రి: తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కిన అభినేత్రి.. హారర్ కామెడీ జోనర్ లో వచ్చింది. కంటెంట్ పరంగా యావరేజ్ అనిపించుకున్నా.. వసూళ్లు ఆ స్థాయిలో కూడా కనిపించలేదు. ప్రభుదేవా-తమన్నాలాంటి స్టార్లు ఉన్నా.. ఆ స్థాయిలో పబ్లిసిటీ లేకపోవడం కలెక్షన్స్ తక్కువగా ఉండడానికి కారణమయింది.

4. హైపర్: ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ఈ మూవీ గతవారంలో వచ్చినాయ.. ఇంకా బీసీ సెంటర్లలో బాగానే ఫేర్ చేస్తోంది. కొన్ని ఏరియాల్లో అయితే అభినేత్రి-ఈడు గోల్డ్ ఎహె చిత్రం కంటే హైపర్ కే టికెట్లు ఎక్కువగా తెగాయి.

5. మజ్ను: నేచురల్ స్టార్ నాని నటించిన ఈ చిత్రానికి క్లాస్ ఆడియన్స్ నుంచి ఇంకా ఆదరణ దక్కుతోంది. చెప్పుకోదగిన సంఖ్యలోనే థియేటర్లు ఉండడం.. మల్టీప్లెక్స్ జనాల నుంచి డిమాండ్ ఉండడంతో.. మజ్ను మరింతగా వసూలు చేసుకుంటున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News