ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి ఈ వీకెండ్లో. ఆ ఐదూ కూడా వేటికవే భిన్నమైనవి. అన్నీ కూడా పాజిటివ్ బజ్ మధ్య రిలీజవుతుండటం మరో విశేషం. ఈ ఐదు సినిమాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్నది రామ్ గోపాల్ వర్మ మూవీ ‘వంగవీటి’నే అనడంలో సందేహం లేదు. ‘రక్తచరిత్ర’ తర్వాత వర్మ సినిమాల్లో అంతటి అంచనాలతో రిలీజవుతున్న సినిమా ఇది. కొన్ని దశాబ్దాల కిందటి బెజవాడ రౌడీయిజం-రాజకీయాల నేపథ్యంలో వర్మ తెరకెక్కించిన ఈ సినిమాపై జనాలు చాలా ఉత్కంఠతో ఉన్నారు. ఇప్పటికే సినిమా చూసిన సెలబ్రెటీలు.. ‘వర్మ ఈజ్ బ్యాక్’ అంటున్నారు. మంచి హైప్ మధ్య ఈ సినిమా రిలీజవుతోంది.
ఇక కమెడియన్ టర్న్డ్ హీరో సప్తగిరి నటించిన ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ మీద కూడా పాజిటివ్ బజ్ ఉంది. ‘తిరుడన్ పోలీస్’ అనే తమిళ హిట్ మూవీకి రీమేక్ ఇది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశారట. ట్రైలర్ చూస్తే బాగానే అనిపించింది. అరుణ్ పవార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక శనివారం విడుదల కానున్న చిన్న సినిమా ‘పిట్టగోడ’ గురించి ఇండస్ట్రీలో చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అష్టాచెమ్మా.. గోల్కొండ హైస్కూల్.. ఉయ్యాల జంపాల లాంటి సినిమాలతో తన అభిరుచిని చాటుకున్న రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించడం.. సురేష్ బాబు బ్యాకప్ ఇస్తుండటంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. దీని ప్రోమోలు కూడా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ మూడు కాకుండా రెండు డబ్బింగ్ సినిమాలు కూడా ఈ వీకెండ్లో థియేటర్లలోకి దిగుతున్నాయి. అందులో ఒకటి విశాల్ మూవీ ‘ఒక్కడొచ్చాడు’. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సూరజ్ దర్శకుడు. తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదలవుతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోందీ సినిమా. దీంతో పాటుగా అమీర్ ఖాన్ ‘దంగల్’ కూడా తెలుగులో ‘యుద్ధం’ పేరుతో రిలీజవుతుండటం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/