ఇండస్ట్రీలో ప్రతిభ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ప్రతిభ ఎంత ఉన్నా కూడా అదృష్టం కలిసి వస్తేనే సక్సెస్ లు దక్కుతాయి. రచయితగా ఎన్నో సూపర్ హిట్స్ ను దక్కించుకున్న బీవీఎస్ రవి అలియాస్ మచ్చ రవి దర్శకుడిగా రెండు సినిమాలు చేసి రెండు ప్లాప్స్ ను మూట కట్టుకున్నాడు. రచయితగా కొనసాగుతున్న రవికి ఇప్పుడు బ్యాడ్ టైమ్ వెంటాడుతుందేమో అనిపిస్తుందని ఆయన సన్నిహితులు స్వయంగా అంటున్నారు.
దర్శకుడిగా ప్లాప్ లు పడటంతో రవి దర్శకత్వం పై ఆసక్తి చూపించడం లేదు. ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కూడా రైటర్ గా హ్యాపీ గా ఉన్నాను అన్నాడట. ఇప్పుడు రచయితగా కూడా కష్టాలు ఎదురవుతున్నాయి. థాంక్యూ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కు కథ ను మచ్చ రవి అందించాడు. సినిమా నిరాశపరచడంతో ఇదేం కథ బాబు అన్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మనం.. 24.. విభిన్నమైన సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు విక్రమ్ కే కుమార్ సినిమా అనగానే కథ మరియు స్క్రీన్ ప్లే విషయాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ విక్రమ్ కే కుమార్ ప్రతిభకు తగ్గట్లుగా మంచి కథను మచ్చ రవి ఇవ్వలేక పోయాడు అనే విమర్శలు వస్తున్నాయి. థాంక్యూ సినిమా కథ పరమ రొటీన్ గా ఉందనేది రివ్యూవర్స్ మాట.
దర్శకుడిగా.. రచయితగా నిరాశ పర్చిన మచ్చ రవి ఇక ముందు షో లు చేసుకోవడం బెటర్ అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన బాలయ్య తో అన్ స్టాపబుల్ టాక్ షో కు పూర్తి బాధ్యత లు మచ్చ రవి చూసుకున్నారు. ఆ షో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ షో కు సీజన్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు. సీజన్ కు కూడా దర్శకత్వం మచ్చ రవి వహించబోతున్నట్లుగా ఆహా టాక్.
థాంక్యూ ఫలితం తర్వాత మచ్చ రవి కథల విషయంలో కూడా ఫిల్మ్ మేకర్స్ ఒకింత అనుమానం ను వ్యక్తం చేస్తారనే టాక్ వినిపిస్తుంది. రైటర్ గా ఎన్నో సూపర్ హిట్స్ ను దక్కించుకున్న మచ్చ రవి పాపం అదృష్టం కలిసి రాకపోవడం తో షో లకు పరిమితం అవ్వాల్సి వస్తుందేమో చూడాలి.