టాలీవుడ్ లో ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా సినిమాల నిర్మాణం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి కిరణ్ అబ్బవరం వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్షణం తీసిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తున్నారు. దీంతో హీరోయిన్ లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. స్టార్ హీరోలు మాత్రం స్టార్ హీరోయిన్ ల కోసం ఎదురుచూస్తుంటే మరి కొంత మంది హీరోలు మాత్రం కొత్త వారి కోసం అన్వేషిస్తున్నారు.
స్టార్ హీరోలు, టైర్ టు హీరోలు మాత్రం పూజా హెగ్డే, రష్మిక మందన్న, శృతిహాసన్, సోనాల్ చౌహాన్ వంటి హీరోయిన్ ల వెంట పడుతున్నారు. స్టార్ హీరోయిన్ ల కొరత వుండటం, భారీ స్థాయిలో పారితోషికాలు పెంచేయడంతో ఇక ఈ మధ్య టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ లు శ్రీలీల, కృతిశెట్టి అంది వచ్చిన ఆఫర్లని దక్కించుకుంటూ పారితోషికాలని కూడా భారీగా డిమాండ్ చేస్తూ చాలా వరకు సినిమాలని ఆక్రమించేస్తున్నారు.
అయితే కొంత మంది హీరోయిన్ లు మాత్రం స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాల కోసం వేచి చూస్తూ దగ్గరికి వచ్చిన అవకాశాల్ని వదులుకుంటున్నారు. కిరణ్ అబ్బవరంతో కలిసి ఎస్..ఆర్ కల్యాణ మండపం సినిమాలో నటించిన ప్రియాంక జవాల్కర్ భారీ అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా అందాల విందు చేస్తూ ఫొటో షూట్ లకు పోజులిస్తూ తన విలువైన సమయాన్ని వృధా చేసుకుంటోంది. స్టార్ ల పక్కనే నటించే బంపర్ ఆఫర్ దక్కాలని వున్న అవకాశాలని వదులుకుంటోంది.
ఇక `డీజే టిల్లు` మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసిన నేహా శెట్టి కూడా ఇదే పంథాని అనుసరిస్తూ భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తూ వచ్చిన అవకాశాల్ని వదులుకుంటోంది. తను డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వడానికి ఇష్టపడని నిర్మాతలు తనని కాదని మరో హీరోయిన్ ని ఫైనల్ చేసుకుంటున్నారు. స్టార్ హీరోలతో కలిసి నటించే సమయం రాకున్నా వారితో నటించాలని, భారీగా డిమాండ్ చేస్తూ యంగ్ హీరోయిన్ లు తమ కెరీర్ కి తామే మంగళం పాడేసుకుంటుండటం పలువురిని షాక్ కు గురిచేస్తోంది.
`ఇస్మార్ట్ శంకర్`తో వెలుగులోకి వచ్చిన కన్నడ బ్యూటీ నభా నటేష్ కూడా ఇదే పంథాని అనుసరిస్తూ కాలయాపన చేస్తోంది. స్టార్ తో మాత్రమే నటిస్తానని భీష్మించుకు కూర్చుంటున్న నభా నటేష్ కు తెలుగులో ఇప్పడు ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా లేకపోవడం గమనార్హం. స్టార్ హీరోల కోసం కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఈ హీరోయిన్ లు ఇప్పటికైనా మనసు మార్చుకుని తమ క్రేజ్ కి తగ్గ హీరోల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇండస్ట్రీలో వుంటారు లేదా తెరమరుగైపోవడం ఖాయం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.