బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన లాల్ సింగ్ చద్దా విడుదలకు సిద్దం అయ్యింది. ఇప్పటికే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడ్డ విషయం తెల్సిందే. ఈ బాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీలో మన హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. అమీర్ ఖాన్ మరియు నాగ చైతన్యల కాంబో సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. ఇటీవలే అమీర్ ఖాన్ మరియు నాగ చైతన్యల కాంబో పిక్స్ ను రివీల్ చేయడం జరిగింది. హిందీ ప్రేక్షకుల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా లాల్ సింగ్ చద్దాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని బాలీవుడ్ మేకర్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాను హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ హాంక్స్ చూడబోతున్నట్లుగా తెలుస్తోంది.
టామ్ హాంక్స్ కు లాల్ సింగ్ చద్దాకు సంబంధం ఏంటా అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటీ అంటూ ఈ సినిమా హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కు రీమేక్. అవార్డు విన్నింగ్ మూవీ ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాను ఒరిజినల్ వర్షన్ లో నటించిన టామ్ హాంక్స్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. అందుకే అమీర్ ఖాన్ అతి త్వరలోనే లాల్ సింగ్ చద్దా ను టామ్ హాంక్స్ కు చూపించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒక ఇండియన్ మూవీని హాలీవుడ్ సూపర్ స్టార్ చూసేందుకు సిద్దం అవ్వడం అంటే ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం.
పైగా ఈ సినిమాలో మన తెలుగు హీరో అక్కినేని నాగ చైతన్య నటించడం మనం మరింత గర్వించదగ్గ విషయం. తెలుగు హీరో నటించిన సినిమా ను హాలీవుడ్ సూపర్ స్టార్ చూడబోతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఫారెస్ట్ గంప్ కు ఇండియన్ సినీ అభిమానుల అభిరుచికి తగ్గట్లుగా మార్చడం జరిగిందట. అమీర్ ఖాన్ స్టార్ డం మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కలిపి లాల్ సింగ్ చద్దా ఒక అద్బుత చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. సినిమా అద్బుతంగా రావడం వల్లే హీరో అమీర్ ఖాన్ ఈ సినిమా ను టామ్ హాంక్స్ కు చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.