అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ - సురేష్ డిస్ట్రిబ్యూషన్స్ & ఎగ్జిబిషన్ వీటన్నిటికీ వెన్ను దన్నుగా నిలుస్తున్నాయి. అయితే అంత పెద్ద నిర్మాత కం థియేటర్ల యజమాని ఇటీవలి కాలంలో ఓటీటీలపై ఆధారపడడం ప్రముఖంగా చర్చకు వస్తోంది. సొంత థియేటర్లు ఉన్నా వాటిని తెరిచేందుకు ఆయన ఆసక్తిగా లేరు. కరోనా మహమ్మారీ తగ్గుముఖం పట్టినా థియేటర్లను నమ్మడం లేదు.
కారణం ఏదైనా కానీ సురేష్ బాబు నిర్మిస్తున్న రెండు భారీ చిత్రాలు ఓటీటీల్లోనే రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో `నారప్ప`ను డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తున్న ఈ నేపథ్యంలో దృశ్యం 2 రీమేక్ కూడా అమెజాన్ ప్రైమ్ కే సురేష్ బాబు కట్టబెట్టారని ఫిల్మ్ నగర్ సమాచారం.
ఈ రెండు సినిమాలకు కలిపి సురేష్ బాబుకి దాదాపుగా 85 కోట్లు అందనున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదలైనా ఇంత భారీ వసూళ్లూ చేసే అవకాశాలు తక్కువగా కనిపించడంతో సురేష్ బాబు ప్రస్తుతానికి తెలివైన నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
రిస్క్ చేసేందుకు ఇష్టపడని ఆయన ఓటీటీలకు తెలివిగా అమ్మేశారని గుసగుస వినిపిస్తోంది. అయితే దీనిని అధికారికంగా సురేష్ బాబు ప్రకటించాల్సి ఉంటుంది.