బెల్లంకొండ లిల్లీ పుట్ బ్యాక్ డ్రాప్?

భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో శ్రీనివాస్ టైసన్ నాయుడు మూవీ చేస్తున్నారు.

Update: 2024-12-31 13:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే. కమర్షియల్ హీరోగా ముద్ర వేసుకున్నారు. చివరగా తెలుగులో అల్లుడు అదుర్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. సరైన హిట్ అందుకోలేకపోయారు. కానీ తన యాక్టింగ్ తో మెప్పించారనే చెప్పాలి.

అయితే తన మూవీల డబ్బింగ్ వెర్షన్లకు నార్త్ లో మంచి రెస్పాన్స్ వస్తుండడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతిని రీమేక్ చేశారు. కానీ ఆ మూవీ డిజాస్టర్ గా మారింది. దీంతో మళ్లీ టాలీవుడ్ పై ఫోకస్ చేసిన బెల్లంకొండ.. ఇప్పుడు వరుస చిత్రాలను లైన్ లో పెడుతున్నారు.

ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీనివాస్.. నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. వాటితో 2025లో ఓ రేంజ్ లో సందడి చేయనున్నారు. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో శ్రీనివాస్ టైసన్ నాయుడు మూవీ చేస్తున్నారు. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసిన ఆ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

దాంతోపాటు.. లుధీర్ భైరెడ్డి దర్శకత్వంలో థ్రిల్లర్ జోనర్ చేస్తున్నారు. కోలీవుడ్ హిట్ మూవీ గరుడన్ రీమేక్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. భైరవం టైటిల్ తో వస్తున్న ఆ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు నారా రోహిత్, మంచు మనోజ్ లీడ్ రోల్స్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్స్ రిలీజ్ అవ్వగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఈ మూడింటితో పాటు.. ఇటీవల కౌశిక్‌ పెగళ్లపాటి ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమా స్టార్ట్ చేశారు శ్రీనివాస్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.8గా సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్‌ లో పూజా కార్యక్రమంతో లాంచ్ అవ్వగా.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన అనౌన్స్మెంట్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. తోలు బొమ్మలాట షాడో, అడవి, యాంటెన్నా టవర్, హార్నెట్ ఉన్న ఆ పోస్టర్ ఆకట్టుకుంది. హార్రర్ మిస్టరీ థ్రిల్లర్ గా మూవీ ఉండనుందని టాక్ రాగా.. ఇప్పుడు లిల్లీ పుట్ బ్యాక్ డ్రాప్ తో మూవీ తెరకెక్కుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లిల్లీ పుట్ కాన్సెప్ట్ తరహాలో సినిమాలు వచ్చి చాలా కాలమైంది.

జానెడు సైజులో ఉండే మనుషులు పూర్వ కాలంలో ఉన్నట్లు కొన్ని చరిత్ర కథనాలు చెబుతున్నాయి. ఇక దర్శకుడు ఆ పాయింట్ ను ఎలా చూపిస్తాడో చూడాలి. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో మూవీ తీస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు.

Tags:    

Similar News