SSMB29: వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘SSMB29’ మూవీకి సంబంధించిన అసలు పనులు ఇటీవల స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘SSMB29’ మూవీకి సంబంధించిన అసలు పనులు ఇటీవల స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. మంచి ముహూర్తం కావడంతో ప్రైవేట్ గా గురువారం సినిమా షూటింగ్ ని ప్రారంభించారు. అయితే ఎక్కడా కూడా అఫీషియల్ గా ఈ విషయంలో క్లారిటీ కూడా ఇవ్వలేదు. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా కె ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాని, విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దేనిపైనా రాజమౌళి నుంచి అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా హైప్ తీసుకురావడానికి రాజమౌళి పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారంట.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి మరో ఆసక్తికరమైన న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాకి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టి-సిరీస్ ఫైనాన్స్ చేయబోతోందంట. ఇప్పటికే రాజమౌళితో భూషణ్ కుమార్ చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అగ్రిమెంట్ జరగబోతోందనే ప్రచారం నడుస్తోంది. పెద్ద మొత్తంలో టి-సిరీస్ ‘SSMB29’ మూవీకి ఫైనాన్స్ చేస్తోందని అనుకుంటున్నారు.
అయితే దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. సినిమాకి ఫైనాన్స్ చేస్తున్నందుకు గాను మూవీకి సంబందించిన మ్యూజికల్ రైట్స్ తో పాటు, హిందీ థీయాట్రికల్ రైట్స్ కూడా టి-సిరీస్ కి ఇచ్చే విధంగా ఒప్పందం జరుగుతున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. నిజానికి జక్కన్న ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడానికి హాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ని రంగంలోకి దించారనే టాక్ వచ్చింది.
హాలీవుడ్ నిర్మాణ సంస్థ అయితే సినిమాకి ఇంటర్నేషనల్ లెవల్ లో మార్కెట్ వస్తుందని. భారీ కలెక్షన్స్ ని అందుకోవడానికి స్కోప్ దొరుకుతుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు టి-సిరీస్ పేరు తెరపైకి వచ్చింది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాజమౌళి ఆర్ఆర్ఆర్ వరకు అన్ని సినిమాలకి ముందు ప్రెస్ మీట్ స్టోరీ కథ ఏంటి, క్యాస్టింగ్ ఎవరనేది చెప్పేవారు.
అయితే ‘SSMB29’ మూవీ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రెస్ మీట్ నిర్వహించలేదు. ఈ మూవీ షూటింగ్ కెన్యాతో పాటు ఇండియాలో జరగబోతోందని అనుకుంటున్నారు. అయితే మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది క్లారిటీ లేదు. దీనిపైన అయిన జక్కన్న స్పష్టత ఇస్తారా లేదా తెలియాల్సి ఉంది.